- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి..
కంచుపాడు గ్రామానికి చెందిన మాదిగ రాజేష్ విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందాడు.

దిశ, ఉండవెల్లి: మండలంలోని కంచుపాడు గ్రామానికి చెందిన మాదిగ రాజేష్(33), హైదరాబాద్ లోని లింగంపల్లిలో మొబైల్ క్యాంటీన్లో పని చేస్తూ గ్రైండర్ ఉన్న కరెంట్ ప్లగ్గును తొలగించే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన ఘటన చోటు చేసుకున్నది. గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కంచుపాడు గ్రామానికి చెందిన రాజు మద్దమ్మ దంపతుల కుమారుడు మాదిగ రాజేష్ భార్య మదనమ్మ కలిసి జీవించేవారు. వీరికి మొదటి కూతురు(2) నాలుగు నెలల క్రితం రెండో కూతురు జన్మించింది. కుటుంబ పోషణ భారం కావడంతో రాజేష్ రెండు నెలల క్రితం హైదరాబాదులోని లింగంపల్లికి వెళ్లి అక్కడ మొబైల్ క్యాంటీన్లో షాపులో పనిచేసేవాడు. గ్రైండర్ పనులు చేస్తూ కరెంట్ ప్లగ్‌ను తీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. జీవనం కోసం వలస వెళ్లిన వ్యక్తి మృతి చెందడంతో స్వగ్రామం కంచుపాడులో విషాదఛాయలు అమ్ముకున్నాయి.






