- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య..
by Taduka Kalyani |
ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం ఉప్పునుంతల మండల కేంద్రంలో జరిగింది.

X
దిశ, ఉప్పునుంతల: ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం ఉప్పునుంతల మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ శేఖర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వంగూర్ మండలంలోని డిండి చింతపల్లి గ్రామానికి చెందిన బద్దుల రవి (28) లారీ డ్రైవర్. మద్యానికి బానిసై తండ్రిని వేధించేవాడు.
బుధవారం సాయంత్రం 6 గంటలకు పోన్ చేసి తనకు రూ. 12 వేలు కావాలని లేకపోతే చనిపోతున్నానని చెప్పడంతో కుటుంబ సభ్యులు పరిసర గ్రామాల్లో వెతికారు. అప్పటికే ఉప్పునుంతల సమీపంలో చెట్టుకు ఉరేసుకొని రవి మృతి చెందాడు. మృతుడి తండ్రి బద్దుల లింగమయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నారు.
Next Story






