కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య..

by Taduka Kalyani |

కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం మిడ్జిల్ మండల పరిధి చిల్వేరు గ్రామ పంచాయతీ రెడ్డిగూడెంలో జరిగింది.

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య..
X

దిశ, మిడ్జిల్: కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం మిడ్జిల్ మండల పరిధి చిల్వేరు గ్రామ పంచాయతీ రెడ్డిగూడెంలో జరిగింది. మిడ్జిల్ ఎస్ఐ రాంలాల్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిగూడెంకు చెందిన రైతు పోతిరెడ్డి రవికుమార్ రెడ్డి శుక్రవారం ఓ విషయమై తన కుటుంబంతో గొడవపడ్డాడు.

ఈ క్రమంలోనే మనస్థాపం చెందిన రవికుమార్ రెడ్డి పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రవికుమార్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతుడి భార్య శౌరీలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story