అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

by Nallavelli.Anjaneyulu |

దిశ, హన్వాడ : అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హన్వాడ ఎస్సై వెంకటేష్ తెలిపిన వివరాల

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, హన్వాడ : అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హన్వాడ ఎస్సై వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హన్వాడ గ్రామానికి చెందిన కమ్మరి వెంకటేష్(43) అనే వ్యక్తి ఇంట్లో కట్టెల షాపు వద్దకు వెళ్తున్నానని చెప్పి శుక్రవారం రాత్రి వెళ్ళాడు. మరుసటి రోజు ఉదయం అయినప్పటికీ కూడా ఇంకా తిరిగి రాలేధు. భార్య సుకన్య షాపు దగ్గరికి వెళ్లి చూడగా షాపులో ఉరివేసుకుని చనిపోయినట్లు తెలిపింది. గత ఆరు నెలల క్రితం కంటి ఆపరేషన్ జరిగిందని.. అలాగే అప్పులు కూడా ఉన్నాయని.. అందుకే మనస్థాపంతో ఉరి వేసుకున్నాడని భార్య సుకన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు.

Next Story