హైద‌రాబాద్ క్రికెట్ టీమ్ కి మ‌క్త‌ల్ బాలుడు ఎంపిక

by Nallavelli.Anjaneyulu |

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవ‌ల నిర్వహించిన టోర్నమెంట్ మక్తల్ కు చెందిన కోలిమి గౌతమ్ ప్రతిభతో ఆడిన మ్యాచ్ ల‌లో బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్ అవార్డ్స్ దక్కించు కొని, రాష్ట్రంలో ఆరో స్థానం నారాయణపేట జిల్లాకి మ‌క్త‌ల్ కి వ‌న్నె తెచ్చాడు.

హైద‌రాబాద్ క్రికెట్ టీమ్ కి మ‌క్త‌ల్ బాలుడు ఎంపిక
X

దిశ‌, మ‌క్త‌ల్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవ‌ల నిర్వహించిన టోర్నమెంట్ మక్తల్ కు చెందిన కోలిమి గౌతమ్ ప్రతిభతో ఆడిన మ్యాచ్ ల‌లో బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్ అవార్డ్స్ దక్కించు కొని, రాష్ట్రంలో ఆరో స్థానం నారాయణపేట జిల్లాకి మ‌క్త‌ల్ కి వ‌న్నె తెచ్చాడు. మంత్రి వాకిటి శ్రీహరి బెస్ట్ విషెస్ తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నమెంట్ లో జిల్లా తరఫున ఎంపికైన కాలిమీ గౌతమ్ మక్తల్ లోని గీతం పాఠశాలలో 10వ తరగతి చదువుకుంటూ కుటుంబ బంధు వైన మంత్రి వాకిటి శ్రీహరిని ఆదర్శంగా తీసుకొని చిన్నప్పటినుండి క్రికెట్ పై ఆస‌క్తి పెంచుకొని రాటు దేలాడు.


హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టోర్నమెంట్ లో ప్లేయర్ గా ఎంపికై జట్టు నుంచి బరిలో దిగి ప్రత్యర్థి జట్ల‌ను చెమటలు ప‌ట్టించాడు. తన ఆటతో టోర్నమెంట్ లో ఆడిన మ్యాచెస్ లో బెస్ట్ బ్యాట్స్ మెన్ అవార్డ్, బెస్ట్ బౌలర్ అవార్డ్, జట్టు ఓడిన కూడా బెస్ట్ ఫైటర్ అవార్డ్స్ కొలిమి గౌతమ్ సొంతం చేసుకున్నాడు. నారాయణ పేట్ జిల్లా నుంచి తన ఆటతో మొదటి స్థానం నిలబడి టోర్నమెంట్ లో పాల్గొన్న 6 జిల్లాల నుంచి మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ లిస్ట్ లో గౌతమ్ 96 పరుగులు 8 వికెట్స్ తీస్తూ రాష్ట్రం లో 6 వ స్థానం లో నిలబడడం నారాయణ పేట్ జిల్లాకు గౌతమ్ పేరు తీసుకురావడం జిల్లాకు చెందిన ప్రతి విభాగ అధికారులు అభినందించారు.

Next Story