మ‌క్త‌ల్ మ‌హిళా ప్ర‌స‌న్న‌కు ఎస్బీఐ ఎం.డీ. ఆనంద్ స‌న్మానం

by Ratna Kumari |

నారాయ‌ణ‌పేట జిల్లా నుంచి మ‌క్త‌ల్ కి చెందిన గిరిమి ప్ర‌స‌న్న‌ను హైద‌రాబాద్ లో చారిటాఫ్ హాన‌ర్స్ గా ఎస్బీఐ ఎం.డీ. ఆనంద్ స‌న్మానించారు.

మ‌క్త‌ల్ మ‌హిళా ప్ర‌స‌న్న‌కు ఎస్బీఐ ఎం.డీ. ఆనంద్ స‌న్మానం
X

దిశ‌, మ‌క్త‌ల్ : నారాయ‌ణ‌పేట జిల్లా నుంచి మ‌క్త‌ల్ కి చెందిన గిరిమి ప్ర‌స‌న్న‌ను హైద‌రాబాద్ లో చారిటాఫ్ హాన‌ర్స్ గా ఎస్బీఐ ఎం.డీ. ఆనంద్ స‌న్మానించారు. మ‌హిళగా ఉంటూ ఎస్బీఐ ఇన్సూరెన్స్ లో క్వాలిఫైడ్ అభ్య‌ర్థిగా ఎంపికై ఈమె ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లో నెల‌రోజుల్లో 25 ల‌క్ష‌ల బీమా పాలసీలు చేసినందుకు చారిటాఫ్ హాన్స‌ర్ గా ఎంపిక‌య్యారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల‌కు చెందిన త‌క్కువ రోజుల్లో ఎక్కువ ఇన్సూరెన్స్ పాల‌సీలు చేసిన వారిలో చారిటాఫ్ హాన‌ర్స్ గా ఎంపిక జ‌రిగింది. నారాయ‌ణ‌పేట జిల్లా నుంచి గిరిమి ప్ర‌స‌న్న ఎంపిక‌య్యారు. హైద‌రాబాద్ లో లియోరిసార్ట్స్ ఎస్బీఐ ఇన్సూరెన్స్ వాళ్లు టీవీ యాంక‌ర్ సుమ తో స‌న్మానించారు. మ‌హిళ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించి వారిని ప్రోత్స‌హిస్తే నిర్దేశించిన ల‌క్ష్యాల‌ను సాధిస్తారు అన‌డానికి గిరిమి ప్ర‌స‌న్న చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ అని ప‌లువురు పేర్కొన్నారు. మ‌హిళ‌లు గృహిణిగా చెల్లిగా, త‌ల్లిగా, విద్యాబుద్దులు చూపించే గురువులుగా ఎందరో ఉన్నార‌ని ఎస్బీఐ ఎం.డీ ఆనంద్ పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎస్బీఐ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా బీఎస్ఎం బీఆర్ ఎం. విజ‌య్ చౌద‌రి, ఆర్.ఎస్. వంశీ చంద‌ర్ రెడ్డి, అన‌సూయ పాల్గొన్నారు.

Next Story