- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీపీఐ వందేళ్ల ముగింపు ఉత్సవాలు విజయవంతం చేయండి
దిశ, అచ్చంపేట రూరల్: భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా మూడు బస్సు జాతాలను పార్టీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో రెండో బస్సు

దిశ, అచ్చంపేట రూరల్: భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా మూడు బస్సు జాతాలను పార్టీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో రెండో బస్సు జాతకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. బాల నరసింహ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం నాయకత్వం వహిస్తున్నారు.శనివారం అచ్చంపేట అంబేద్కర్ చౌరస్తాలో బస్సు జాత ప్రచార కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీఐ అచ్చంపేట నియోజకవర్గ కార్యదర్శి పేర్ముల గోపాల్ మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ, పేదల కోసం నిరంతరం పోరాడిన ఏకైక పార్టీ అని తెలిపారు. దేశ స్వతంత్ర ఉద్యమానికీ ఈ పార్టీ అగ్రగామిగా నిలిచిందని, పార్టీ శతాబ్ది ముగింపు ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న రెండో బస్సు జాతను అచ్చంపేట ప్రజలు విశేషంగా విజయవంతం చేయాలి అని ఆయన కోరారు. శనివారం గద్వాల్ జిల్లాలో ప్రారంభమైన బస్సు జాత, 17న నాగర్ కర్నూల్ జిల్లాలోకి ప్రవేశించనుందని తెలిపారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు అచ్చంపేట బస్టాండ్ సమీపానికి జాత చేరుకోనుంది అని, అనంతరం డిండి మీదుగా జాత ప్రయాణించి 21న కొత్తగూడెం జిల్లాకు చేరుకోనుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గోరేటి నరేష్, కృష్ణ, రాజు, మంజుల, లాలయ్య, చిట్టమ్మ, నరేష్, స్వామి, శాంతమ్మ, దేవి పాల్గొన్నారు.






