- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ సర్పంచ్ హత్య కేసులో ప్రధాన నిందితులు అరెస్టు
నందిన్నె గ్రామ మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు హత్య కేసులో ప్రధాన నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస్ రావు గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

దిశ, జోగులాంబ ప్రతినిధి : ఈ నెల 21వ తేదిన జాంపల్లి స్టేజి సమీపానా జిల్లాలో సంచలంగా మారిన కేటిదొడ్డి మండలం నందిన్నె గ్రామ మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు హత్య కేసులో ప్రధాన నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస్ రావు గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నందిన్నె గ్రామ మాజీ సర్పంచ్ చిన్న భీమా రాయుడుకి అదే గ్రామానికి చెందిన మిల్లు ఈరన్నకు మధ్య రాజకీయ, ఆర్థికపరమైన విభేదాలు ఉండేవని, రైస్ మిల్లు పై చిన్న భీమా రాయుడు కేసులు పెట్టించారనే కోపం తో మిల్లు ఈరన్నా చిన్న భీమారాయుడిని ఎలాగైనా అంతమేందించేందుకు సుపారీ గ్యాంగ్ తో 25 లక్షలకు భేరం కుదుర్చుకొని బోలెరే వాహనంతో ఈ నెల 21 వతేదిన చిన్న భీమారాయుడుని వెనుకనుండి అతివేగం తో డీకోట్టించగా భీమారయుడు అక్కడిక్కడే మరణించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. చిన్న భీమారాయుడి అన్న పెద్ద భీమారాయుడు ప్రమాద సంఘటన పై అనుమానంతో పోలీస్ లకు పిర్యాదు చేయడం జరిగిందని సంఘటన పై పూర్తి స్థాయిలో విచారించగ మిల్లు వీరన్ నే హత్యకు కారణమని తెలిసిందన్నారు.
హత్యకు కారణమైన నిందుతులను అరెస్ట్ చేసి నిందితుల నుంచి 8,50,000 రూపాయలు, 4కార్లు, 1-బొలేరో, 2బైక్ లు, 11 మొబైల్ పోలీస్ లు స్వాధీనం చేసుకున్నారన్నారు.రిమాండ్కు తరలించిన వారిలో మిల్లు వీరన్నతో పాటు కుర్వ సురేందర్, బోయ వీరన్న, తెలుగు మధు బాబు, తెలుగు కృష్ణ, సంజీవులు, బైరీ సుంకన్న, బైరీ కేశన్న, ప్రభుస్వామి, హరిజన్ రాజేశ్ ఉండగా, కర్నూల్ జిల్లాకు చెందిన ఈశ్వర్య గౌడ్ పరారిలో ఉన్నారన్నారు. కేసును త్వరతీగతిన పూర్తిచేసిన పోలీస్ సిబ్బందికి రివార్డ్ ఎస్పీ చేతులమీదుగా అందించారు.






