అభివృద్ధి పథంలోకి మహబూబ్ నగర్ : మంత్రి వాకిటి శ్రీహరి

by Ratna Kumari |

వేల కోట్ల రూపాయల నిధులతో మహబూబ్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తుందని రాష్ట్ర యువజన, క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.

అభివృద్ధి పథంలోకి మహబూబ్ నగర్ : మంత్రి వాకిటి శ్రీహరి
X

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి : వేల కోట్ల రూపాయల నిధులతో మహబూబ్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తుందని రాష్ట్ర యువజన, క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా శుక్రవారం స్థానిక ఎంవీఎస్ కళాశాల మైదానంలో జరిగే సభా ప్రాంగణ ఏర్పాట్లను ఆయన స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ ఒబెదుల్లా కొత్వాల్, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, డిసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ లతో కలిసి పర్యవేక్షించి మాట్లాడారు. పాలమూరు ప్రజల ఎన్నో దశాబ్దాల కలలకు కార్యరూపం దాల్చనున్నదని, శనివారం జిల్లా కేంద్రంకు సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పర్యటించి 1465.32 కోట్ల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు చేసే శంకుస్థాపనలతో చరిత్రలో ఒక మైలురాయిగా నిలువనున్నదని మంత్రి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పాలమూరు చరిత్రలో ఏనాడు ఎరుగని విధంగా అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంఖుస్థాపనలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. 220.94 కోట్లతో శాశ్వత తాగునీటి సమస్యకు పరిష్కారం, 400 కోట్లతో ఐఐఐటీ కళాశాల ఏర్పాటు, 603 కోట్లతో పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, 20 కోట్లతో ఎంవిఎస్ కళాశాల భవనం పనులకు, అలాగే 200 కోట్లతో ఇంటీగ్రేటేడ్ స్కళ్లు, 1.30 కోట్లతో చిల్డ్రన్స్ హోం, 20 కోట్లతో పాలమూరు యూనివర్సిటీలో ఎస్టీ హాస్టల్ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ బెక్కెరి అనిత, వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Next Story