- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వంగూరు మండల రైతులకు మహర్దశ.. సీఎం పైలట్ ప్రాజెక్టు కి శ్రీకారం..!
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లాలో అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఆదివాసి చెంచు రైతుల్లో వెలుగులు నింపేలా " ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం" మే 19 న

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లాలో అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఆదివాసి చెంచు రైతుల్లో వెలుగులు నింపేలా " ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం" మే 19 న సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం అచ్చంపేట నియోజకవర్గం లో అన్ని మండలాలలో రైతులకు ఉచితంగా సోలార్ విద్యుత్ పంపు చెట్లు ఏర్పాటు చేస్తామని సభా వేదిక నుంచి ప్రకటించారు. అందుకు సంబంధించి సంబంధిత విద్యుత్, వ్యవసాయ శాఖ అధికారులు మండలాల వారిగా విద్యుత్ పంపుసెట్లు వివరాలను సేకరించేలా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మొదటి విడతగా సీఎం సొంత మండలం వంగూరు మండలాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్, శాఖ ఇతర విద్యుత్ శాఖ ఉన్నత అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మండలంలో 30 వేల ఎకరాల భూమి ఉన్నట్లు అగ్రికల్చర్ ఏవో ప్రియదర్శిని తెలిపారు.
వంగూరు మండలంలో పైలెట్ ప్రాజెక్టు ద్వారా ఉచిత సోలార్ పంపుసెట్లు
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలో 27 గ్రామపంచాయతీలు కలవు. మండల వ్యాప్తంగా రైతులకు గల విద్యుత్ పంపు సెట్లు 7500 ఉన్నట్లు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పైలట్ ప్రాజెక్టు ద్వారా అన్ని పంపుసెట్లు సోలార్ పంపుసెట్లుగా మార్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో మండలంలో ఉన్న రైతులందరికీ శుభపరిణామం అని చెప్పవచ్చు. ఇక నుంచి రైతులు పైసా ఖర్చు లేకుండా సోలార్ పంపు ద్వారా వ్యవసాయం చేసుకోవచ్చు. అందుకు శనివారం ఆర్థిక శాఖ జీవో నెంబర్ 49 ద్వారా రూ. 258 కోట్లు నిధులను విడుదల చేసింది. ఈ పథకం ద్వారా రైతులందరికీ మేలు జరగనుంది.
ఆన్ గ్రీడ్ ద్వారా విద్యుత్ సరఫరా
వంగూరు మండల విద్యుత్ శాఖ అధికారి మేఘనాథ్ ని దిశ శనివారం ఫోన్ ద్వారా వివరణ కోరగా.. సీఎం రేవంత్ రెడ్డి అచ్చంపేట నియోజకవర్గం మొత్తం రైతులందరికీ ఉచిత సోలార్ విద్యుత్ సెట్లు మంజూరు చేస్తామని ప్రకటించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వంగూరు మండలంలో దాదాపుగా 7235 విద్యుత్ పంపుసెట్లు ఉన్నట్లు గుర్తించామని, అందుకు సంబంధించి పూర్తి సర్వే జరగాల్సి ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఆన్ గ్రేడ్ ద్వారా రైతులకు సరఫరా అందించబడుతుందని, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు అవసరం పడతాయో అంచనా వేయాల్సి ఉన్నదని, వివిధ సంస్థల ద్వారా పనులు జరగాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ పథకం ద్వారా రైతన్నలకు మరింత మేలు
సీఎం రేవంత్ రెడ్డి అచ్చంపేట నియోజకవర్గ మొత్తంగా 8 మండలాలలో ఉచితంగా రైతులందరికీ సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తారని ప్రకటించిన విధంగా మొదటి విడతలో ప్రాజెక్టు ద్వారా సీఎం సొంత మండలం వంగూరు మండలాన్ని ఎంపిక చేసి పనులకు శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో రైతులకు కరెంటు చార్జీలు పూర్తిగా తగ్గి రైతన్నలు మరింత ఆదాయం పెరిగేలా ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






