- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహాభారత చరిత్ర అంతా యాదవుల ప్రస్తావనే : మాజీ మంత్రి తలసాని
యాదవులంతా కలిసి మెలిసి ఉండాలని.. గ్రూపు రాజకీయాలు చేయవద్దని సూచించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

దిశ, అచ్చంపేట : దేశంలో మహాభారత చరిత్ర అంతా కూడా యాదవుల ప్రస్తావనేనని.. దేశంలో ఎక్కడ చూసినా యాదవ సోదరులు అధిక సంఖ్యలో ఉన్నారని, గ్రూపు రాజకీయాలు లేకుండా కలిసి ఉండాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా పదరా మండల కేంద్రంలో శ్రీకృష్ణ విగ్రహ ధ్వజస్తంభ, గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ..అత్యంత ప్రాధాన్యత గల తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన ముఖద్వారం తలుపులు తీసేది మన యాదవ సోదరుడే అని గుర్తు చేశారు.
సీఎం సీఎం అంటూ నినాదాలు..
యాదవులను ఉద్దేశించి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతుండగా.. అక్కడ ఉన్న యాదవులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. అందుకు తలసాని సమాధానం ఇస్తూ.. టైం వస్తదని హాట్ కామెంట్ చేశారు. యాదవులకు ఏ అవసరం ఉన్న నేనున్నానని గుర్తుంచుకోవాలని సూచించారు. నా సహకారం ఉంటుందని ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులు సమాజమంతా ఎల్లప్పుడూ పొందాలని కొనియాడారు.
గ్రూప్ రాజకీయాలు మానండి
యాదవులు ఎక్కడున్నా కూడా పెద్దలు, యువత అంతా కూడా గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికి ఐక్యతతో కలిసి ఉండాలని సూచించారు. రాజకీయాలు రాబోయే రోజులలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. నీతికి, నిజాయితీకి మారుపేరు యాదవులని గుర్తు చేశారు. ఈ గుడి అభివృద్ధి కోసం నా వంతు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. దారి పొడవునా తలసాని శ్రీనివాస్ యాదవ్ కు భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాయ ఎల్లమ్మ శ్రీనివాసులు, జాతీయ యాదవ హక్కుల అధ్యక్షులు రాములు, హోసన్న యాదవ్, శ్రీకృష్ణుని ఆలయ అధ్యక్షుడు ఎడమచంద్రయ్య, కమిటీ సభ్యులు ముత్యాలు, అల్లరాజు, రాములు, రామచంద్రయ్య, వెంకటయ్య, మనోహర్, అజయ్, అంజయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.






