ప్రారంభం కానున్న మద్దిమడుగు అంజన్న వార్షిక బ్రహ్మోత్సవాలు

by Bhanu |   (  Updated:2025-11-27 11:24:04  IST  )

నల్లమల్ల ప్రాంతంలోని నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు గ్రామంలో వెలిసిన పిలిస్తే పలికే.. భక్తుల కొంగుబంగారంగా పిలువబడుతున్న శ్రీ పబ్బతి మద్దిమడుగు అంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 30 నుండి డిసెంబర్ 4 వరకు జరుగు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.

ప్రారంభం కానున్న మద్దిమడుగు అంజన్న వార్షిక బ్రహ్మోత్సవాలు
X

దిశ, అచ్చంపేట : నల్లమల్ల ప్రాంతంలోని నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు గ్రామంలో వెలిసిన పిలిస్తే పలికే.. భక్తుల కొంగుబంగారంగా పిలువబడుతున్న శ్రీ పబ్బతి మద్దిమడుగు అంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 30 నుండి డిసెంబర్ 4 వరకు జరుగు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుండి అత్యధికంగా భక్తులు హాజరు కానున్నారు. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ ప్రధాన రహదారి అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామం నుండి 52 కిలోమీటర్ల దూరంలో మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయం ఉన్నది.

స్వామివారి చరిత్ర..

రాష్ట్రంలో పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటైన నాగర్ కర్నూల్ జిల్లాలోని మద్దిమడుగు పబ్బతి అంజనేయ స్వామి వారి దేవస్థానం ఒకటి. పచ్చదనానికి నిలయమైన నల్లమల్ల కొండలపై ప్రవహించే కృష్ణ నది ఉత్తర వాహినిగా.. పశ్చిమ భాగాన దుందుభినది సంభవించు రెండు నదుల కలయిక నడుమ 12 కి.మీ దూరంలో పకృతి రమణీయ దృశ్యముల నడుమ వెలసిన ప్రకృతి వడిలో సహజంగా వదిగిన మద్దిమడుగు పుణ్యక్షేత్రానికి కృష్ణానది ఒక ఆభరణం లాంటిదే. క్రీస్తు శకం 1120 కాలము నాడు అలనాటి ఆటవికులకు స్వయంభుగా స్వామివారి దర్శనం ఇచ్చి ఉండేనని చర్చించుకుంటారు.

భక్తుల కొంగుబంగారం..

మద్దిమడుగు క్షేత్ర పాదాలను స్పక్షిస్తూ కదిలే కృష్ణమ్మ భక్తుల పాపాలను కడుగుతుందని శోభియ భారంగా కరివిందు చేస్తూ ఉంటుందని వారి నమ్మకం. ఆంజనేయ స్వామివారిని మనస్ఫూర్తిగా సేవిస్తే తీరని బాధలు అడ్డు ఉండవని, గాలి, ధూళీ లాంటి మానసిక బాధలు, మొండి వ్యాధులను నయం చేసే దేవుడిగా, సంతానార్తులకు సంతానాన్ని ప్రసాదించే ఇలవేల్పుగా మానసిక ఆందోళనలు హరించే స్వామిగా ఇలా కొలిచే భక్తులకు కొంగుబంగారంగా ఆ దేవదేవుడు కొనియాడబడుతున్నాడు. స్వామివారికి 41 రోజులు నిష్ఠతతో దీక్ష పరీక్షలలో చేస్తే ఎలాంటి కోరికలు అయినా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకు ప్రతి ఏడాది రెండు పర్యాయాలు భక్తులు శ్రీ హనుమాన్ దీక్షను వేలాదిగా సేకరిస్తూ ఉంటారు.

అత్యంత శక్తి క్షేత్రంగా కోట మైసమ్మ..

అత్యంత మహిమాన్విత్వ శక్తి క్షేత్రంగా మద్దిమడుగు లో వెలసిన కోట మైసమ్మ అమ్మవారు అగ్రస్థానాన్ని వహిస్తుంది. ప్రతి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని దర్శించుకుంటారు. సహస్ర కోటి లాభాలతో పిలుపు అందుకుంటున్న‌ జగన్నాథడు పంచేంద్రియాలను నిగ్రహిస్తూ, భూతాత్మకమైన శరీరాన్ని భరిస్తూ ప్రకృతి శక్తులను నియంత్రిస్తూ కలియుగంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి జగన్నాథ్మ ఈ క్షేత్రం కోట మైసమ్మ అమ్మవారిగా అవతరించింది.

బ్రహ్మోత్సవ కార్యక్రమాలు..

మద్దిమడుగు ఆంజనేయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ఈనెల 30 నుండి డిసెంబర్ 4 వరకు రోజువారి కార్యక్రమాలు ఇలా జరగనున్నాయి. 30న ఆదివారం ఉదయం నిత్యార్చన విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యం, యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం ఉష్ణవాహన సేన డిసెంబర్ 1న విగ్నేశ్వర పూజ, హోమము, రుద్ర హోమము, స్వామివారి సహస్ర నామార్చన, బలిహరణ, నీరాజన మంత్రపుష్పము, సాయంత్రం చండీ హోమము బలిహరణ తీర్థ ప్రసాద వితరణ, రాత్రికి అశ్వవాహన సేవ, 2న విగ్నేశ్వర పూజ, మూలమంత్ర హోమములు, హనుమాన్ వ్రతం సాయంత్రం నిత్యోపసానలు, బలిహరణ, రాత్రికి పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం, మంగళహారతి గజవాహన సేవ, 3న రోజువారి పూజా కార్యక్రమాలతో పాటు రాత్రికి సీతారాముల కళ్యాణ మహోత్సవం గరుడవాహన సేవ రాత్రి 9:30 నిమిషాలకు హనుమాన్ మహా పడిపూజ కార్యక్రమం హనుమాన్ దీక్ష స్వాముల సమక్షంలో భక్తిశ్రద్ధతో అత్యంత వైభవంగా నిర్వహించబడును. 4న పూజలతో పాటు మన్య సూక్తములతో ఆంజనేయస్వామి వారికి 108 కలశములచే మహా స్నాపనము నిర్వహించబడును. తదుపరి హనుమాన్ గాయత్రి హోమం మహా పూర్ణహుతితో బ్రహ్మోత్సవాలు ముగియ‌నున్నాయి.

ఏర్పాట్లు పూర్తి..

హనుమాన్ బ్రహ్మోత్సవాల సందర్భంగా మద్దిమడుగు ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, వైద్య సదుపాయాలు ఇతర ఏర్పాట్లు అన్ని పూర్తి చేశామని ఈవో రంగాచారి తెలిపారు. ఆలయ వద్ద నిత్య అన్నదానం చేసేందు కుభక్తుల నుండి విరాళాలు కోరుచున్నామని, భక్తులు ఇచ్చే విరాళాలను బట్టి వారికి ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి దర్శనం సదుపాయం కల్పించనున్నట్లు వారు వివరించారు.

Next Story