- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరణ
by Ratna Kumari |
మిడ్జిల్ గ్రామానికి చెందిన ఓ వివాహితుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో నమ్మించి గర్భవతిని చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

X
దిశ, మిడ్జిల్ : మిడ్జిల్ గ్రామానికి చెందిన ఓ వివాహితుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో నమ్మించి గర్భవతిని చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గత పది సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నామని తనను పెళ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకొని తనను గర్భవతిని చేశాడని, పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించినట్టు తెలిపారు. శుక్రవారం యువతి, ఆమె కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో యువతి తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. యువతి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ శివనాగేశ్వర్ తెలిపారు.
Next Story






