- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదుపుతప్పిన రేషన్ బియ్యం సరఫరా చేసే లారీ
మండల పరిధిలోని శానాయపల్లి గ్రామ శివారులో పులి కుంట సమీపంలో ప్రజా పంపిణీ సరుకులైన రేషన్ బియ్యం తీసుకెళ్లే లారీ అదుపుతప్పి జనాల పైకి దూసుకెళ్లింది.

దిశ, రేవల్లి : మండల పరిధిలోని శానాయపల్లి గ్రామ శివారులో పులి కుంట సమీపంలో ప్రజా పంపిణీ సరుకులైన రేషన్ బియ్యం తీసుకెళ్లే లారీ అదుపుతప్పి జనాల పైకి దూసుకెళ్లింది. దీంతో ఓ ద్విచక్ర వాహనం నుజ్జు నుజ్జు అయింది. అక్కడ ఉన్న జనాలు చాకచక్యంగా పక్కకు తప్పుకోవడంతో నలుగురు ప్రమాదం నుండి బయట పడ్డారు. దీంతో ఒక్కసారిగా జనాలు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపి28 టీఏ4763 నెంబర్ గల లారీ కొంకలపల్లి లోని గోదాం కు బియ్యం నింపుకోవడానికై నాగర్ కర్నూల్ వైపు నుంచి వస్తుండగా.. పులికుంట సమీపంలోకి రాగానే వ్యవసాయ పనులను నిమగ్నమై ఉన్న నలుగురు వ్యక్తులపైకి దూసుకెళ్లింది. ఇది డ్రైవర్ నిర్లక్ష్యమా లేదా లారీ వైఫల్యం కానీ ఎడమ పక్కకు దూసుకెళ్లింది. దీంతో ప్రమాదాన్ని పసిగట్టిన ఆ నలుగురు వ్యక్తులు క్షనాల్లో చాకచక్యంగా చెల్లా చెదరై పరుగెత్తి ప్రణాలను కాపాడుకున్నారు. అక్కడే ఉన్న ద్విచక్ర వాహనం మాత్రం నుజ్జునుజ్జయింది. చుట్టుపక్కల రైతులు గమనించి ఆపకుండా వెళ్ళిపోతున్న లారీని వెంబడించి పట్టుకున్నారు.






