జిల్లాకు రానున్న 'లోక్ అదాలత్ మొబైల్ వ్యాన్లు' : జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత

by Ratna Kumari |

'Lok Adalat mobile vans' coming to the district District Chief Justice Premalatha

జిల్లాకు రానున్న లోక్ అదాలత్ మొబైల్ వ్యాన్లు : జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఉచిత న్యాయ సహాయం, సలహాలు, బాధితులకు న్యాయ హక్కులపై మార్గదర్శకాలు, గ్రామాల్లో లీగల్ అవెర్ నెస్ క్యాంపులు,తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు జిల్లాకు 'లోక్ అదాలత్ మొబైల్ వ్యాన్లు' రానున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని 34 జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ లకు కేవలం 4 లోక్ అదాలత్ మొబైల్ వ్యాన్లు మాత్రమే ఉండేవని శనివారం హైదరాబాద్ హెచ్ఐసీసీ హైటెక్స్ సమీపంలోని నోవోటెల్ లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, 'నాల్సా'ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టీస్ విక్రమ్ నాథ్ జిల్లాలో న్యాయ సేవలను మరింత విస్తరించేందుకు మరో రెండు మొబైల్ లోక్ అదాలత్ వ్యాన్ల ను (మల్టీ యుటిలిటీ వాహనాలు) ప్రారంభించినట్టు ఈ ప్రారంభ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ పి.సామ్ కోషి, జస్టిస్ కె.లక్ష్మణ్ తదితర న్యాయమూర్తులు పాల్గొన్నారని ఆమె తెలిపారు. ప్రధానంగా ప్రభుత్వ పథకాల పై ప్రజలకు అవగాహన కల్పించడం, చట్టాల పై షార్ట్ ఫిల్మ్స్, ఈ మొబైల్ వ్యాన్ల ద్వారా వివాదాలను త్వరగా పరిష్కారించడం, విడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయ సలహాలు అందించడం లాంటి ద్వారా గ్రామీణ ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేస్తాయని న్యాయమూర్తి వివరించారు. రోటేషన్ పద్ధతిలో ఈ వ్యాన్లు జిల్లా కు రానున్నట్లు, టోల్ ఫ్రీ నెంబర్ 15100 ద్వారా ప్రజలు న్యాయ సలహాలను పొందవచ్చునని జిల్లా జడ్జి ప్రేమలత సూచించారు.

Next Story