- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SLBC ప్రమాద సమీపంలోకి లోకో ట్రైన్ ట్రాక్ పునరుద్ధరణ
ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల టన్నెల్ ఇన్లెట్ 1 ఆఫీస్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో బుధవారం ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి సమీక్ష సమావేశం నిర్వహించారు.

దిశ, అచ్చంపేట : ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల టన్నెల్ ఇన్లెట్ 1 ఆఫీస్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో బుధవారం ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి సమీక్ష సమావేశం నిర్వహించారు. నేటితో సహాయక చర్యలు 47వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల కొనసాగుతున్న సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు, సొరంగం లోపల మట్టి తవ్వకాలకు అనుగుణంగా లోకో ట్రైన్ ట్రాక్ను పునరుద్ధరిస్తున్నట్లు, మట్టి తవ్వకాలు స్టీల్ కత్తిరింపు పనులు డీ వాటరింగ్ ప్రక్రియ సమాంతరంగా కొనసాగుతున్నాయని వివరించారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మైన్స్ సీనియర్ శాస్త్రవేత్త జీసీ నవీన్, నీటిపారుదల శాఖ డీఈ శ్రీనివాసులు, కంపెనీ సీనియర్ ఇంజనీర్ సంజయ్ కుమార్ సింగ్ ప్రమాద ప్రదేశంలో పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలియజేశారు. మట్టి తవ్వకాల కనుగుణంగా కన్వేయర్ బెల్ట్ వెంటిలేషన్ ప్రక్రియ ముందుకు కొనసాగిస్తున్నట్లు, సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నట్లు ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి, వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్మీ అధికారులు, జేపీ కంపెనీ ప్రతినిధులు, ఎస్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్ రెడ్డి, సింగరేణి మైన్స్ రెస్క్యూ అధికారులు, హైడ్రా అధికారి, దక్షిణ మధ్య రైల్వే అధికారి, తదితరులు పాల్గొన్నారు.






