ప్రభుత్వ నిర్ధిష్ట సమయానికి మద్యం షాపులు మూసివేయాలి : డీఎస్పీ వెంకటేశ్వర్లు

by Ratna Kumari |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి మద్యం షాపులు తప్పనిసరిగా మూసివేయాలని డిఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశించారు.

ప్రభుత్వ నిర్ధిష్ట సమయానికి మద్యం షాపులు మూసివేయాలి : డీఎస్పీ వెంకటేశ్వర్లు
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి మద్యం షాపులు తప్పనిసరిగా మూసివేయాలని డిఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఎస్పీ జానకి ఆదేశాల మేరకు మంగళవారం మహబూబ్ నగర్ పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో జిల్లా కేంద్రంలోని అన్ని మద్యం దుకాణాల యజమానులతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. మైనర్లకు మద్యం విక్రయించరాదని, నూతన సంవత్సర వేడుకల పేరుతో చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరగకుండా దుకాణ యజమానులు అప్రమత్తంగా ఉండాలని, మద్యం సేవించి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే సంబంధింత దుకాణ యజమానులపై కూడా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే దుకాణాల వద్ద గుంపులుగా ఏర్పడకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా దుకాణం యజమానులే చూసుకోవాలని, పోలీస్ శాఖతో సమన్వయం పాటిస్తూ, నిబంధనలు ఉల్లంఘించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిఎస్పీ వెంకటేశ్వర్లు కోరారు. ఈ సమావేశంలో వన్ టౌన్ సీఐ అప్పయ్య, టూ టవున్ సీఐ ఇజాజొద్ధీన్, రూరల్ సిఐ గాంధీనాయక్, ఎస్ఐ విజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story