- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పండుగ పూట తీవ్ర విషాదం
దిశ, బిజినేపల్లి : ఉదయం నుంచి ఆనందంగా కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులతో విజయదశమి పండుగను సరదాగా గడుపుకున్న వ్యక్తి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి

దిశ, బిజినేపల్లి : ఉదయం నుంచి ఆనందంగా కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులతో విజయదశమి పండుగను సరదాగా గడుపుకున్న వ్యక్తి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందడంతో ఆ కుటుంబంతో పాటు బంధువులు సన్నిహితులను శోకసంద్రంలో ఉంచిన ఘటన లింగసానిపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగసానిపల్లి గ్రామానికి చెందిన బోనాసి రామచందర్(40) విజయదశమి పండుగ సందర్భంగా తన బంధువులకు సన్నిహితులను జమ్మి ఆకు పెట్టేందుక ఇంటి నుండి బయలుదేరి ఇంటికి చేరుకొని తిన్న తర్వాత గ్రామంలో నీటిని విడుదల చేసేందుకు వెళుతుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన ఓ ప్రైవేటు వాహనంలో తీసుకొని వెళుతుండగా మార్గమధ్యంలోనే తన తుది శ్వాస విడిచాడు అని తెలిపారు. లింగసానిపల్లి గ్రామంలో గత పది సంవత్సరాల నుంచి గ్రామపంచాయతీ వాటర్ మెన్ గా చెత్త బండి డ్రైవర్గా ఒక్కడే విధులు నిర్వహిస్తూ పనిచేసిన ఇతను ఇప్పుడు గ్రామంలో లేకపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామపంచాయతీ సిబ్బంది మంచికి మారుపేరుగా మృతుడు బోనాసి రామచందర్ గ్రామంలోని ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడని, పండగ పూట మృతి చెందడంతో గ్రామంలోని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వపరంగా గ్రామ పంచాయతీ కార్మికుని అన్ని విధాల ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుచున్నారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు సంతానం ఉన్నారు.






