- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేత.. అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ గా నామినేషన్..!
ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేత.. అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ గా నామినేషన్..!
దిశ, బిజినేపల్లి : బిజినేపల్లి మండలం, లట్టుపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కమతం నందిని శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ముగ్గురు పిల్లల నిబంధన ప్రభుత్వం ఇటీవలే ఎత్తివేసినట్టు

X
దిశ, బిజినేపల్లి : బిజినేపల్లి మండలం, లట్టుపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కమతం నందిని శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ముగ్గురు పిల్లల నిబంధన ప్రభుత్వం ఇటీవలే ఎత్తివేసినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాలో స్థిరపడ్డ కుటుంబం.. సర్పంచ్ గా నామినేషన్ వేశారు. వాస్తవానికి దాదాపు ఆరు సంవత్సరాల నుంచి వారి కుమార్తెల వద్దనే అమెరికాలో ఉంటున్నారు. లట్టుపల్లి గ్రామంలో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయడం, సర్పంచ్ జనరల్ స్థానంలో మహిళ కు అవకాశం రావడంతో కమతం నందిని అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ పదవికి నామపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతో అమెరికా నుంచి తన గ్రామానికి వచ్చానని అందరూ సహకరించి భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని తెలిపారు.
Next Story






