ఎన్నికల విడిపోయిన చేతులే అభివృద్ధిలో కలుపుదాం : మంత్రి వాకిటి శ్రీహ‌రి

by Ratna Kumari |

దిశ‌, మ‌క్త‌ల్ : ఎన్నిక‌ల్లో విడిపోయిన చేతులే అభివృద్ధిలో క‌లుపుదామ‌ని మంత్రి వాకిటి శ్రీహ‌రి పేర్కొన్నారు. శ్రీరామ్ కాల‌నీలో

ఎన్నికల విడిపోయిన చేతులే అభివృద్ధిలో కలుపుదాం : మంత్రి వాకిటి శ్రీహ‌రి
X

దిశ‌, మ‌క్త‌ల్ : ఎన్నిక‌ల్లో విడిపోయిన చేతులే అభివృద్ధిలో క‌లుపుదామ‌ని మంత్రి వాకిటి శ్రీహ‌రి పేర్కొన్నారు. శ్రీరామ్ కాల‌నీలో ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడుర‌వికుమార్ ఆధ్వ‌ర్యంలో రూ.3కోట్ల‌తో సీసీరోడ్డు, డ్రైనేజ్, నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. మ‌క్త‌ల్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి లేద‌ని స్థానికుల‌కే ఆవేద‌న ఉంటుంది. చేతులు క‌లిపేందుకు మ‌క్త‌ల్ అభివృద్ధిని కోరే అఖిల ప‌క్ష నాయ‌కులు చేతులు క‌లుప‌కుండా విమ‌ర్శ‌ల‌తో కోర్టు కేసుల‌తో సోష‌ల్ మీడియా పోస్టుల‌తో ఆవేద‌న క‌లిగిస్తుంద‌ని అన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు వెయ్యి కోట్ల‌తో ప‌లు అభివృద్ధి నిర్మాణ ప‌నులు చేస్తున్నామ‌ని తెలిపారు. విద్య‌, వైద్య ప‌రంగా, మౌళిక వ‌స‌తుల‌తో అభివృద్ధి చేయ‌డ‌మే త‌న ల‌క్ష్యం అన్నారు. మక్త‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి క‌నెక్ట్ అయ్యేవిధంగా ఉన్న రోడ్ల‌ను తారు రోడ్లుగా తీర్చిదిద్ద‌డం మారుమూల గ్రామాల నుంచి మండ‌ల కేంద్రానికి మండ‌ల కేంద్రం నుంచి నియోజ‌క‌వ‌ర్గానికి ప్ర‌జ‌ల‌కు రాక‌పోక‌ల‌కు ర‌వాణా సౌక‌ర్యం రోడ్డు మార్గం క‌ల్పించ‌డంతో అభివృద్ధి సాధ్య‌ప‌డుతుంద‌ని తెలిపారు. ప్ర‌తి గ్రామంలో అన్ని వ‌స‌తుల‌తో పాటు పాఠ‌శాల‌ల‌ను అభివృద్ధి సాధ్య‌ప‌డుతుంద‌ని తెలిపారు.


ప్రతి గ్రామంలో అన్ని వసతులతో పాఠశాలలను అన్ని వర్గాల విద్యార్థులకు కార్పొరేటర్ స్థాయిలో విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అలాగే ఆధునిక వైద్యం కల్పించేందుకు నూటయాబైపడకల ఆసుపత్రి, తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు ఏర్పాటు చేయాల‌న్న‌దే త‌న ఉద్దేశం అని తెలిపారు. రాష్ట్రంలో ట్యాంక్ బండ్ల సుందరీకరణ కోసం కేటాయించిన నిధులను వాడుకోకుండా నిర్లక్ష్యం చేసింది ఒక మక్తల్ నియోజకవర్గమే అని. ఈ నిర్లక్ష్యాన్ని మన నియోజకవర్గానికి ప్రాతినిధ్య వహించిన నాయకులు చేసిన విషయాలను సామాజిక మాధ్యంలో ఎందుకు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ నాయ‌కులు క‌ట్టా సూరికోల వెంకటేష్, నూర్ పాష‌, శంషుద్దీన్, గ‌ణేష్, న‌రేంద‌ర్, అధికారులు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ శ్రీరామ్, ఇంజినీర్ నాగ‌శివ కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Next Story