- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్పంచ్ ప్రమాణ స్వీకారాన్ని ఆపుతాం : మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
దిశ, మక్తల్ : సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని లీగల్ గా అడ్డుకుంటామని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం

దిశ, మక్తల్ : సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని లీగల్ గా అడ్డుకుంటామని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో సర్పంచ్ లు, వార్డ్ మెంబర్ల కు సన్మానం చేసే కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. బుధవారం ముస్లాయపల్లిలో జరిగిన పోలింగులో రెండో వార్డు, నాలుగో వార్డుల్లో దొంగ ఓట్లు వేయడం వల్ల ఒక్క ఓటుతో సర్పంచ్ గా గెలుపొందారని.. దీనిపై తాము అభ్యంతరం చెప్పిన రికౌంటింగ్ చేయకపోవడం వల్ల ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, అలాగే కోర్టు మెట్లు ఎక్కుతామన్నారు. రెండో వార్డు, నాలుగో వార్డు రెండేసి చొప్పున నాలుగు ఓట్లు వేయడంతో ముస్లాయపల్లి సర్పంచ్ పదవీ ని కాంగ్రెస్ కైవసం చేసుకుందని అక్రమ పద్ధతిలో గెలవడం కాంగ్రెస్ పార్టీకి సర్వసాధరణమే అని, దీనిని నిరూపించడానికి రీకౌంటింగ్ చేయడానికి అవకాశం ఇవ్వలేదని చట్టప్రకారం.. న్యాయపరంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. న్యాయం కోసం కోర్టు మెట్లెక్కుతామని వారు తెలిపారు.






