రేపు బంద్ విజ‌య‌వంతం చేద్దాం

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, పాన్ గ‌ల్ : తెలంగాణ రాష్ట్రంలో బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ శ‌నివారం చేప‌ట్ట‌బోయే రాష్ట్ర బంద్ ను విజ‌యవంతం చేయాల‌ని కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గ‌ బీసీ

రేపు బంద్ విజ‌య‌వంతం చేద్దాం
X

దిశ‌, పాన్ గ‌ల్ : తెలంగాణ రాష్ట్రంలో బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ శ‌నివారం చేప‌ట్ట‌బోయే రాష్ట్ర బంద్ ను విజ‌యవంతం చేయాల‌ని కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గ‌ బీసీ నాయ‌కులు ప‌గిడాల శ్రీనివాస్ పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల, బ‌ల‌హీన వ‌ర్గాల నాయ‌కులు డాక్ట‌ర్ ప‌గిడాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్ర‌వారం విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. బడుగు, బలహీన వర్గ ప్రజల హక్కు 42 శాతం రిజర్వేషన్ మనకు రావాలని మన హక్కు సాధించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర బంద్ కార్యక్రమంలో ప్రజలు, పెద్దలు, యువకులు, మహిళలు కలిసి ఒక్కటిగా ముందుకు రావాలన్నారు. మన హక్కు మనకు మన భావితరాల కోసం చేసే ఉద్యమం‌ మన రాబోయే తరాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు 42% రిజర్వేషన్ కొరకు ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర బందులో పాల్గొని విజయవంతం చేయాల‌ని కోరారు.

Next Story