- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్షయ రహిత రాష్ట్రంగా రూపొందించుకుందాం : గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ
దిశ, మహబూబ్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రాన్ని క్షయ రహిత రాష్ట్రంగా రూపొందించుకోవలసిన బాధ్యత మేధావులు, కవులు, కళాకారులు, సాహితీవేత్తలపై ఉందని రాష్ట్ర

దిశ, మహబూబ్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రాన్ని క్షయ రహిత రాష్ట్రంగా రూపొందించుకోవలసిన బాధ్యత మేధావులు, కవులు, కళాకారులు, సాహితీవేత్తలపై ఉందని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా పర్యటన సందర్భంగా కలెక్టరేట్ లో వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఎంపీడీకే అరుణ, ఎమ్మెల్యేలు యన్నం శ్రీనివాస్ రెడ్డి, జీఎంఆర్, గవర్నర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ దాన కిషోర్ , ఐజి ఎల్ ఎస్ చౌహన్ , ఎస్పీ జానకి తదితరులతో కలిసి గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దేశవ్యాప్తంగా క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోనూ, మహబూబ్ నగర్ జిల్లాలోనూ క్షయ నివారణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు. వ్యాధుల నివారణకు,మూఢాచారాలు, రుగ్మతలను తొలగించేందుకు సామాజిక కార్యకర్తలు, రచయితలు, కవులు, కళాకారులు తమ సాహిత్యాల ద్వారా, వీధి నాటకాలు, జానపద గేయాలు, రచనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఉన్న చెంచుల సమగ్ర సర్వతో ముఖాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను చివరి లబ్ధిదారుడికి చేరేవరకు కృషి చేయవలసిన బాధ్యత.. ఇటు అధికారులు.. అటు ప్రజాప్రతినిధులపై ఉందని విష్ణు దేవ్ వర్మ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి జన్మాన్, దర్తీ ఆబా అభియాన్ పథకాల ద్వారా స్వయం ఉపాధి, సౌర విద్యుత్తు, పక్కా ఇండ్లు, విద్య తదితర పథకాలు చెంచులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా ప్రాశస్త్యాన్ని వివరించిన కలెక్టర్
మహబూబ్ నగర్ జిల్లా ప్రాసస్త్యాన్ని కలెక్టర్ విజయేంద్ర బోయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్ కు వివరించారు. జిల్లా విశిష్టత, పర్యాటక స్థలాలు, విద్య, వైద్య సదుపాయాల గురించి తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వివిధ రంగాలలో తాము చేసిన సేవలను గురించి 16 మంది ప్రముఖులు గవర్నర్ కు వివరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రామీణ అభివృద్ధి, వైద్య, మెప్మా, రెడ్ క్రాస్ సొసైటీ, మహిళా శిశు సంక్షేమ సంఘం ఏర్పాటుచేసిన స్టాల్స్ ను గవర్నర్ పరిశీలించారు. అనంతరం ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయమహా అభియాన్ పథకం కింద చెంచులకు ఆరోగ్య పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన వైద్య వాహనాన్ని గవర్నర్ జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో గవర్నర్ మొక్క నాటి నీళ్లు పోశారు.
గవర్నర్ కు ఘన స్వాగతం :
జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కు ఘనస్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి,అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మధుసూదన్ నాయక్ గవర్నర్ కు పూల బొకేలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు.






