న‌ర్సాయ‌ప‌ల్లి ప్రాంతంలో చిరుత‌పులి క‌ల‌కలం..!

by Nallavelli.Anjaneyulu |

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో చిరుతపులి క‌ల‌క‌లం రేపింది. కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని కోడేరు మండలం నర్సాయపల్లి నుంచి మైలారం రోడ్డులో చిరుత పులి సంచ‌రిస్తున్నట్లు రైతులు గుర్తించి ఆందోళన చెందారు.

న‌ర్సాయ‌ప‌ల్లి ప్రాంతంలో చిరుత‌పులి క‌ల‌కలం..!
X

దిశ‌, కోడేరు : నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో చిరుతపులి క‌ల‌క‌లం రేపింది. కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని కోడేరు మండలం నర్సాయపల్లి నుంచి మైలారం రోడ్డులో చిరుత పులి సంచ‌రిస్తున్నట్లు రైతులు గుర్తించి ఆందోళన చెందారు. ఈ విషయం తెలుసుకున్న కొల్లాపూర్ డిప్యూటీ రేంజర్ కాశన్న ఆధ్వర్యంలో సెక్షన్ ఆఫీసర్ శివ కుమార్, బీట్ ఆఫీసర్ గౌడ్ కలిసి ఆదివారం చిరుత సంచరించిన ప్రాంతంలో పరిశీలించారు. కాళ్ల జాడలను నిశితంగా పరిశీలించి చిరుత పులివేనని ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ కాశన్న తెలిపారు. గత నాలుగైదు రోజులుగా ఎత్తం శివారులో ఉన్న గుడిసె ఈశ్వరయ్య పొలంలో కూడా చిరుత పులి జాడలు ఉన్నట్లు ఆ ప్రాంత రైతులు చెబుతున్నారు. గుడిసె ఈశ్వరయ్య పొలంలో చిరుత పులి జాడలను సైతం అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా డిప్యూటీ రేంజర్ కాశన్న మాట్లాడుతూ నర్సాయపల్లి ,మైలారం ఎత్తం గ్రామాల రైతులు తమ పశువులు, గొర్రెలను వ్యవసాయ పొలాల్లో ఉంచుకోవద్దని సూచించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు.

Next Story