- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాడే మోసిన బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
by S Gopi |
అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మండలం కొంకల గ్రామంలో నిన్న రాత్రి లివర్ ప్రాబ్లమ్ తో స్వేరో విద్యార్థి... Latest News

X
దిశ, వడ్డేపల్లి: అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మండలం కొంకల గ్రామంలో నిన్న రాత్రి లివర్ ప్రాబ్లమ్ తో స్వేరో విద్యార్థి నేపాల్ మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం కొంకల గ్రామంలోని వారి స్వగృహానికి వెళ్లి నేపాల్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాడే మోసి అంతిమయాత్రలో పాల్గొని వారికి, వారి కుటుంబానికి బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారందరినీ ఆయన ఓదార్చారు. వీరితోపాటు బీఎస్పీ నాయకులు జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు ఎంసీ కేశవరావు, మహేష్, యామని సుంకన్న, బాబు మరియు మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
Next Story






