8న కొల్లాపూర్ లో దివంగత సీపీఐ నేత సురవరం సంస్మరణ సభ

by Nallavelli.Anjaneyulu |

దిశ, కొల్లాపూర్ : భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, దివంగత మాజీ ఎంపీ సురవరం

8న కొల్లాపూర్ లో దివంగత  సీపీఐ నేత సురవరం సంస్మరణ సభ
X

దిశ, కొల్లాపూర్ : భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, దివంగత మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ ఈ నెల 8న బుధవారం ఉదయం 10 గంటలకు కొల్లాపూర్ పట్టణంలో సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు వద్ది రాంరెడ్డి కుటుంబీకులు తెలిపారు. ఈ సంస్మరణ సభ పట్టణంలోని మహబూబ్ పంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వద్ధి నర్సిరెడ్డి, పెద్ద కొత్త పల్లి మాజీ సర్పంచ్ కందాళ రామకృష్ణ, ఎన్మన్ బెట్ల మాజీ సర్పంచ్ ఎల్లేని లక్ష్మణ్ రావు వెల్లడించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సభ కు వక్తలుగా మంత్రి జూపల్లి కృష్ణా రావు, రాష్ట్ర ప్రాణాళిక బోర్డు వైస్ చైర్మన్ జి. చిన్నా రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు బాల నర్సింహా, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సిలు దామోదర్ రెడ్డి, గోరేటి వెంకన్న, ఓయూ ప్రొఫెసర్ ఖాసీం, మాజీ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు, టీపీసీసీ సభ్యుడు చింతలపల్లి జగదీశ్వర్ రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్, సురవరం విజయ లక్ష్మి, తో పాటు పలువురు హాజరువుతున్నట్లు వారు తెలిపారు.

Next Story