కర్నూలు ప్రమాదం.. గద్వాల కలెక్టర్, ఎస్పీ పరామర్శ

by I. Sairam |

కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద చోటు చేసుకున్న ఘోర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించింది.

కర్నూలు ప్రమాదం.. గద్వాల కలెక్టర్, ఎస్పీ పరామర్శ
X

దిశ, గద్వాల క్రైమ్: కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద చోటు చేసుకున్న ఘోర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించింది. స్వయంగా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాస రావు ప్రమాదం జరిగిన తీరును నిశితంగా పరిశీలించి, కర్నూలు జిల్లా అధికారులతో మాట్లాడారు. సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం, మృతి చెందిన వారి మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లను పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయాలను అందించేందుకు రెండు జిల్లాల యంత్రాంగాలు కలిసి పనిచేస్తున్నాయి.

బాధితుల కోసం హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్‌లు..

బస్సు ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికుల కుటుంబ సభ్యులకు సమాచారం, సాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం తక్షణమే హెల్ప్‌లైన్ (సహాయ కేంద్రం) తో పాటు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. బాధిత కుటుంబాలు ఈ క్రింది అధికారులను, నంబర్లను సంప్రదించవచ్చు:

* హెల్ప్‌లైన్ అధికారులు:

* రామచంద్ర, అసిస్టెంట్ సెక్రటరీ: 9912919545

* చిట్టిబాబు, సెక్షన్ ఆఫీసర్: 9440854433

* కంట్రోల్ రూమ్‌లు:

* గద్వాల పోలీస్ కంట్రోల్ రూమ్: 8712661828

* గద్వాల కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 9502271122

* కలెక్టరేట్ హెల్ప్ డెస్క్: 9100901599, 9100901598

* కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి కంట్రోల్ రూమ్: 9100901604

ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, డ్రైవర్, ఆపరేటర్‌ నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారు తెలిపారు.

Next Story