రేపు నాగర్ కర్నూలు జిల్లా కు రానున్న కేటీఆర్

by Ratna Kumari |

దిశ, అచ్చంపేట : రాష్ట్రంలో స్థానిక ఎన్నికల పరిణామాల అనంతరం బీఆర్ఎస్ దాదాపు 45 శాతం సర్పంచ్ స్థానాలు కైవసం

రేపు  నాగర్ కర్నూలు జిల్లా కు రానున్న కేటీఆర్
X

దిశ, అచ్చంపేట : రాష్ట్రంలో స్థానిక ఎన్నికల పరిణామాల అనంతరం బీఆర్ఎస్ దాదాపు 45 శాతం సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ పటిష్టత కోసం దూకుడు పెంచేందుకు కేసీఆర్ ఫామ్ హౌస్ లో పలు దపాలుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు పార్టీ ముఖ్య నేతలతో కలిసి సమీక్ష చేసిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేక పవనాలు మొదలయ్యాయని గమనించిన నాయకత్వం దాదాపు సంవత్సరాలుగా నిశ్శబ్దంగా ఉన్న కేసీఆర్ ఒక్కసారిగా తన ఫామ్ హౌస్ లో ముఖ్య నాయకుల సమావేశంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇంతవరకు తట్టేడు మట్టి తీయలేకపోయిందని.. ప్రజా సమస్యలను కేవలం ఉన్న ప్రభుత్వ ఆస్తులను అమ్ముతూ పాలన మొత్తం గాడి తప్పిందని ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ ప్రజా ఉద్యమాలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించిన విషయం పాఠకులకు తెలిసిందే. కేసీఆర్ ప్రకటనతో ఒక్కసారిగా ఉమ్మడి పాలమూరు జిల్లా పార్టీ ఇన్చార్జిలు మాజీ ఎమ్మెల్యేలు అలర్ట్ అవుతూ రాజకీయ సమీకరణలు వేగంగా చేపడుతున్నారు.

ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లాకు కేటీఆర్ రాక..

గత వారం రోజుల క్రితం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జరుగుతున్న అన్యాయం పై ప్రాజెక్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 80 శాతం పూర్తి చేసిన మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా అయి ఉండి కూడా ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లేందుకు ఎలాంటి నిధులు కేటాయించకుండా ఇప్పటివరకు చక్కటి మట్టి తీయలేదని విమర్శిస్తూ ప్రజా పోరాటం ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి మొదలుపెడదామని ప్రకటించడంతో నాగర్ కర్నూల్, అచ్చంపేట పార్టీ కింది స్థాయి నాయకత్వం బలోపేతం చేసేలా కేటీఆర్ ప్రకటన ఉండబోతుంది.

ఆ రెండు నియోజకవర్గాల సర్పంచ్లకు సన్మానం

స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఆశించిన స్థాయిలో విజయాలు కైవసం చేసుకోవడంతో సర్పంచ్ లను మరింత ఉత్తేజపరిచేలా సన్మాన కార్యక్రమం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గం లో 131 గ్రామ‌పంచాయ‌తీలు ఉండగా.. 54, అచ్చంపేట నియోజకవర్గంలో, 134 జీపీలకు ఎన్నికలు జరగగా.. 48 గ్రామపంచాయ‌తీల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.

ఇన్ చార్జిని ప్రకటించేనా..?

ఆదివారం జరగనున్న రెండు నియోజకవర్గాల సర్పంచ్ల సన్మాన కార్యక్రమం సందర్భంగా కేటీఆర్ పర్యటన ఉండడంతో అచ్చంపేట నియోజకవర్గం పార్టీ ఇన్ చార్జిని ప్రకటించే అవకాశం ఉన్నట్టా.. లేనట్టా..? అనే చ‌ర్చ పార్టీ కార్యకర్తలలో జరుగుతుంది. త్వరగా ఇన్ చార్జిని నియమిస్తే పార్టీ సాధకబాధకాలతో పాటు కార్యకర్తలకు నాయకులకు మరింత భరోసానిస్తూ ఇకనుండి జరగబోయే అనేక ప్రజా పోరాటాలకు గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను బలోపేతం చేసే అవకాశం ఉంటుందని నియోజకవర్గం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.

జిల్లా ఇన్ చార్జి బాధ్య‌త‌లు మ‌ర్రికే..?

రెండుసార్లు శాసనసభ్యునిగా కొనసాగిన నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి అచ్చంపేట ఇన్చార్జి బాధ్యతలు అనుకున్న పరిధిలో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణలో భాగంగా జిల్లా ఇన్చార్జిలను ఏర్పాటు చేసే దిశలో పార్టీ ఆలోచన చేస్తున్న నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా ఇన్చార్జి బాధ్య‌తలు కూడా మర్రి జనార్దన్ రెడ్డికి కట్టబెట్టే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. నేటి సమావేశంలో కేటీఆర్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతుంది. రేపు కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌లో ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి మ‌రీ.

Next Story