- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న కొడంగల్ చిన్నారి
నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎల్ కేజీ చదువుతున్న హన్మంతు, అనిత దంపతుల కుమార్తె ప్రసన్న పుట్టినప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది.

దిశ, మద్దూరు : నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎల్ కేజీ చదువుతున్న హన్మంతు, అనిత దంపతుల కుమార్తె ప్రసన్న పుట్టినప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. తల్లిదండ్రులు నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించగా.. న్యూమోనియా వ్యాధితో బాధపడుతుందని మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని నీలోఫర్ ఆసుపత్రికి రిఫర్ చేయడంతో అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు తలసేమియా వ్యాధి సోకిందని నిర్ధారించారు. ఈ వ్యాధి కారణంగానే రక్త కణాలు సరిగా ఉత్పత్తి కావడం లేదని, చిన్నారికి ప్రతి 20 రోజులకోసారి రక్తమెక్కించాలన్నారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు 20 రోజులకు ఓసారి హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో బి పాజిటివ్ రక్తం ఎక్కించడం జరుగుతుందని, అది దొరకని సందర్భంలో రూపాయలు ఐదువేలు వెచ్చించి కొనుగోలు చేసి ఎక్కించడం జరుగుతుందని తల్లిదండ్రులు తెలిపారు.
ఈ వ్యాధి నయం కావాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ చేస్తే శాశ్వతంగా నయం అవుతుందని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ కు 30 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని తమకు అంత ఆర్థిక స్తోమత లేదని ముఖ్యమంత్రి, దాతలు సాయం చేసి తమ కూతురి ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు తల్లిదండ్రులు. మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని రేణివట్ల గ్రామానికి చెందిన పదవ వార్డు కౌన్సిలర్ గోవిందు 30 వేల రూపాయల చెక్కును, కొత్తపల్లి మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన కృష్ణయ్య 2000/- రూపాయలు బుధవారం చిన్నారి తల్లిదండ్రులకు అందజేశారు. దాతలు ఇప్పటివరకు 62000/- సహాయం చేశారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరింత మంది దాతలు ముందుకు రావాలని వేడుకుంటున్నారు.






