- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాదపు అంచున కిష్టారం పోతిరెడ్డి చెరువు అలుగు
దిశ, జడ్చర్ల : ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు జడ్చర్ల మండలం లోని కిష్టారం గ్రామంలో పోతిరెడ్డి చెరువు కు భారీ ఎత్తున వరద పోటు ఎత్తడంతో పోతిరెడ్డిపాడు చెరువు

దిశ, జడ్చర్ల : ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు జడ్చర్ల మండలంలోని కిష్టారం గ్రామంలో పోతిరెడ్డి చెరువు కు భారీ ఎత్తున వరద పోటు ఎత్తడంతో పోతిరెడ్డిపాడు చెరువు అలుగు పారి కిష్టారం గ్రామంతో పాటు సమీప గ్రామ ప్రజలకు భయం గుప్పెట్లో నెట్టడంతోపాటు అంబఠాపురం గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధ దంపతులను అలుగు ప్రవాహం పొట్టలో పెట్టుకుంది. ఈ క్రమంలోనే భారీగా పారిన అలుగు ప్రవాహంతో పాటు పోతిరెడ్డి చెరువులో భారీగా చేరిన వర్షపు నీటితో చెరువు అలుగు కింది భాగం కోతకు గురిఆయి మనిషి ఎత్తు భాగంలో గండి పడింది. దీంతో చెరువు అడుగు భాగం నుంచి భారీ ఎత్తున నీరు బయటికి వృధాగా పోతుండడంతో పాటు ఆలుగు కింది భాగం కోతకు గురవుతుంది. దీంతో పోతిరెడ్డి చెరువు అలుగు తెగిపోయే ప్రమాదకరస్థాయికి చేరుకుంది ఈ అలుగు కుంగి తెగితే మరి ఎంతమందిని పొట్టన పెట్టుకోనుందని, సమీప గ్రామాల పంటలు కులాలకు తీవ్ర నష్టం వాటిలనుంది.
చెరువు కు పంట పొలాలకు మొత్తం ప్రమాదకర స్థాయిలో నష్టం వాటిల్లనుంది. ప్రమాదకర స్థాయిలో ఉన్న పోతిరెడ్డి చెరువు అలుగును ఇరిగేషన్ అధికారులు వెంటనే పరిశీలించి ప్రమాదం జరగకముందే నష్టం వాటిల్లకముందే అలుగు పడిన గండిని పూర్తి వేసి చెరువును కాపాడాలని ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని పని గ్రామాల ప్రజలతో పాటు రైతులు అధికారులను వేడుకుంటున్నారు. ఇరిగేషన్ అధికారులకు గ్రామస్తులు తెలపడంతో పోతిరెడ్డి చెరువు అలుగు వద్దకు ఇరిగేషన్ ఏఈ యాసర్ చేరుకొని అలుగు కింది భాగంలో పడ్డ గండిని పరిశీలించారు. వాస్తవానికి చెరువుపై భాగం నుంచి అలుగు నీరు వస్తుండడంతో పాటు కింది భాగం నుంచి కూడా నీరు లీక్ అవుతున్నట్లు ఆయన గమనించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల సమాచారం అందించి వారి ఆదేశాల మేరకు వెంటనే గండి పూడ్చివేతకు చర్యలు తీసుకుంటామని ఆయన రైతులకు తెలిపారు.






