అమెరికా కిడ్నాప్ న‌కు పాల్పడడం ఉగ్రవాద చర్యే : సీపీఎం

by Nallavelli.Anjaneyulu |

అమెరికా వెనుజులా దేశం పై బాంబు దాడులను, ఆ దేశ అధ్యక్షుడు నికలోస్ మధురోను ఆయన భార్యను కిడ్నాప్ చేయడాన్ని ఉగ్రవాద చర్యగా సీపీఎం పార్టీ వనపర్తి జిల్లా కార్యదర్శిపుట్టఆంజనేయులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బార్ అభివర్ణించారు.

అమెరికా కిడ్నాప్ న‌కు పాల్పడడం ఉగ్రవాద చర్యే :  సీపీఎం
X

దిశ, వనపర్తి : అమెరికా వెనుజులా దేశం పై బాంబు దాడులను, ఆ దేశ అధ్యక్షుడు నికలోస్ మధురోను ఆయన భార్యను కిడ్నాప్ చేయడాన్ని ఉగ్రవాద చర్యగా సీపీఎం పార్టీ వనపర్తి జిల్లా కార్యదర్శిపుట్టఆంజనేయులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బార్ అభివర్ణించారు. వనపర్తి సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పరమేశ్వర చారి అధ్యక్షతన సోమవారం వనపర్తి పట్టణంలో అంబేద్కర్ చౌక్ సీపీఎం ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బార్ లు మాట్లాడుతూ అమెరికన్ సామ్రాజ్యవాదం వెనిజులాపై సాగించిన ఈ దాడులను, వెనిజులా అధ్యక్షుడు నికలోస్ మధురో ఆయన భార్యను కిడ్నాప్ చేయడాన్ని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఇదంతా అంతర్జాతీయ చట్టాన్ని దారుణంగాఉల్లంఘించాడమేన్నారు. డ్రగ్స్ పేరుతో చమురు కోసం వెనిజులాపై అమెరికా దాడి చేసిందని, వెనిజులాపై బాంబు దాడులు అమెరికా నేతృత్వంలో సామ్రాజ్యవాదం సాగించిన అంతర్జాతీయ ఉగ్రవాద చర్య అన్నారు. 10 దేశాలలో యుద్ధాన్ని ఆప్యానని గొప్పలు చెప్పే శాంతి ప్రవచనాలు పలికే యుద్దోన్మాది ట్రంపు వెనిజులా దేశం పై ఎలా దాడి చేశారని విమర్శించారు. అత్యంత హెయ మైనా అమెరికా సైనికోన్మదాపుముఖాన్ని మొత్తంగా ప్రపంచానికి చూపెట్టింది అని అన్నారు.

వెనుజులా పై దాడిని ప్ర‌ధాని మోడీ మౌనం ఎందుకు..?

ప్రపంచ పోలీసులా అమెరికా వ్యవహరిస్తుందన్నారు. ప్రపంచ శాంతికి కారణం మేమే అని నోబెల్ బహుమతి నాకు ఇవ్వాలని ట్రంప్‌ అనడాన్ని తప్పు పట్టారు.ఈ తరుణంలో వెను జులా ప్రజలకు సంగీభవంగా సీపీఎం నిలుస్తుందని తెలిపారు. ఈ చర్యను సీపీఎం వనపర్తి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. వెనిజులా పై అత్యంత దారుణమైన ఈ దురాక్రమణ చర్యలకు నిలువరించేలా అంతర్జాతీయ సమాజం ఒత్తిడి పెంచాలన్నారు. భద్రతా మండలి తక్షణమే సమావేశమై ఈ చర్యలు ఖండించాలన్నారు. వెనిజులా దేశ అధ్యక్షుడు మధురోను అతని భార్యను బేషరతుగా విడుదల చేయించాలని డిమాండ్ చేశారు.వెనుజులాలో ఉన్న చమురు బావులపై , బంగారు నిక్షేపాలపై కన్ను పడి దోచుకోవడానికి అమెరికా చర్యని చెప్పంటిందని విమర్శించారు. అనేక ప్రపంచ దేశాలు వెనుజులా పై దాడిని ఖండిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహించడం ఏమిటి ప్రశ్నించారు.ఇప్పటికైనా అమెరికా బానిస దేశం భారతదేశం కాదని రుజువు చేసుకోవాలని స్వతంత్ర సార్వభౌమధికారం ఉన్న భారతదేశంగా గర్వంగా ప్రపంచశాంతికి కాపాడే దేశంగా అమెరికా ఉగ్రవాద చర్యలకు ప్రధాని మోడీ ఖండించాలని అన్నారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పరమేశ్వర చారి అధ్యక్షతన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బార్, డి.బాల్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు గంధం మదన్, గట్టయ్య, రమేష్, జి.బాలస్వామి, బీసన్న నాయకులు రాబర్ట్, సాయి లీల, మన్యం, నందిమల్ల రాములు, మద్దిలేటి, ఉమా, పుల్లయ్య, డి.శ్రీను,నారాయణ, బాలపీరు, జి.భాస్కర్ పాల్గొన్నారు.

Next Story