- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహబూబ్ నగర్ కలెక్టర్ గా ఖుష్బూ గుప్త
by Ratna Kumari |
మహబూబ్ నగర్ నూతన కలెక్టర్ గా ఖుష్బూ గుప్త బదిలీ అయ్యారు. పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్ జిల్లాలో భదౌర్ అనే పట్టణానికి చెందిన ఆమె 2019 ఐఏఎస్ బ్యాచ్ కు చెందింది.

X
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ నూతన కలెక్టర్ గా ఖుష్బూ గుప్త బదిలీ అయ్యారు. పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్ జిల్లాలో భదౌర్ అనే పట్టణానికి చెందిన ఆమె 2019 ఐఏఎస్ బ్యాచ్ కు చెందింది. ముందుగా ఆమె బీహార్ కేడర్ కు ఎంపికవ్వగా.. వివాహం కారణంగా తెలంగాణ కేడర్ కు బదిలీ అయింది. ప్రస్తుతం ఖుష్బూ గుప్త ఉట్నూర్ ఐటీడీఏ పీవో గా పని చేస్తున్న తరుణంలో గురువారం మహబూబ్ నగర్ కలెక్టర్ గా బదిలీ అయ్యారు. 2024 జూన్ 16 నుంచి ఇక్కడ పని చేస్తున్న కలెక్టర్ విజయేందిర బోయి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ కమిషనర్ గా బదిలీపై వెళ్లారు. బహుశా శుక్రవారం నూతన కలెక్టర్ గా ఖుష్బూ గుప్త బాధ్యతలు స్వీకరించనున్నారు.
Next Story






