- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నకిలీ విత్తనాలపై నిఘా ఉంచండి: కలెక్టర్ రవినాయక్
by Taduka Kalyani |
నకిలీ విత్తనాలు లేకుండా కట్టుదిటమైన చర్యలు చేపట్టి గట్టి నిఘాను ఉంచాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ అధికారులను ఆదేశించారు.

X
దిశ, మహబూబ్ నగర్: నకిలీ విత్తనాలు లేకుండా కట్టుదిటమైన చర్యలు చేపట్టి గట్టి నిఘాను ఉంచాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ అధికారులను ఆదేశించారు. జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల వలన ప్రస్తుతం జిల్లాలో నకిలీ విత్తనాల సమస్య లేకపోయినా, చిన్న చిన్న లోటు పాట్లను సైతం సవరించుకుంటూ, ముందు జాగ్రత్త చర్యగా వ్యవసాయ శాఖ అధికారులు వారి పరిధిలోని అన్ని విత్తన విక్రయ కేంద్రాలు, డీలర్లు, ఏజెన్సీలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆయన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్ ను ఆదేశించారు.
స్థానిక పోలీస్, ఎస్ఐ లు సైతం నకిలీ విత్తనాలు అరికట్టడంలో సహకరించాలని, వ్యవసాయ అధికారులతో తనిఖీ కి వెళ్ళాలని, త్వరలోనే వ్యవసాయ, పోలీస్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
Next Story






