తెలంగాణ‌కు అస‌లైన విల‌న్లు కేసీఆర్, కేటీఆర్, హ‌రీశ్ రావు : ఎంపీ మ‌ల్లు ర‌వి

by Ratna Kumari |

దిశ, జడ్చర్ల : తెలంగాణకు అసలైన విలన్లు కేసీఆర్, కేటీఆర్, హ‌రీశ్ రావు అని గుర్తించే గత శాసనసభ ఎన్నికల్లో వారిని ఓడగొట్టి వారికి తగిన బుద్ధి చెప్పారని నాగ‌ర్ క‌ర్నూల్ ఎంపీ మ‌ల్లు ర‌వి గుర్తుకు చేశారు.

తెలంగాణ‌కు అస‌లైన విల‌న్లు కేసీఆర్, కేటీఆర్, హ‌రీశ్ రావు : ఎంపీ మ‌ల్లు ర‌వి
X

దిశ, జడ్చర్ల : తెలంగాణకు అసలైన విలన్లు కేసీఆర్, కేటీఆర్, హ‌రీశ్ రావు అని గుర్తించే గత శాసనసభ ఎన్నికల్లో వారిని ఓడగొట్టి వారికి తగిన బుద్ధి చెప్పారని నాగ‌ర్ క‌ర్నూల్ ఎంపీ మ‌ల్లు ర‌వి గుర్తుకు చేశారు. తెలంగాణ‌ విలన్ కాంగ్రెస్ అనే ముందు ఒకటికి పది సార్లు ఆలోచన చేయాలని మనం ఏం మాట్లాడినా ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారని తెలిపారు. ఆదివారం జడ్చర్ల పట్టణంలోని తన అనుచరులతో కలిసి స్థానిక మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి అసలైన విలన్లు కాంగ్రెస్సే అని కేటీఆర్ అనడం హాస్యాస్పదమ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు అసలైన విలన్.. ఆ రెండు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు తీస్తున్నందుకు అసలైన అని ప్రశ్నించారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్ర ప్రజలను మర్చిపోయినందుకు ధర్నా చౌక్ ఎత్తేసినందుకు, ఐదు సంవత్సరాల పాటు మహిళకు మంత్రి పదవి ఇవ్వనందుకు..? దళితులకు ముఖ్యమంత్రి పదవీ ఇస్తానని ఇవ్వనందుకు, దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమి ఇస్తానని ఇవ్వనందుకు, అభివృద్ధి సంక్షేమాన్ని మరిచినందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు తెలంగాణకు అసలైన విలన్లు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ల‌ను గుర్తించి గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పారని తెలిపారు.

మ‌రోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఒక్క ఎంపీ సీటు కూడా రాకుండా చేయడంతో పాటు ఏడు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రానికి ఎవరు అసలైన విలన్ లో ప్రజలే తేల్చి చెప్పారని మల్లు రవి తెలిపారు. కేటీఆర్ మాటలు మాట్లాడే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడాలని, ప్రజలకు ఆలోచన శక్తి ఉందని ఎవరు ఏం మాట్లాడినా దాని ఇంకా ఉన్న అర్థం ఏందో ప్రజలకు తెలుసని అన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను ఊహించని విధంగా భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల పట్టణ అధ్యక్షుడు మినాజ్, కాంగ్రెస్ నాయకులు దాల్ ఖాజా, అశోక్ యాదవ్, మాలిక్ షాకీర్, సర్పరాజ్ ఆసిఫ్, సుల్తాన్ కింగ్, కాజా ఉన్నారు.

Next Story