ఆడ‌బిడ్డ‌ల‌కు భ‌రోసా క‌ళ్యాణ‌ల‌క్ష్మీ : డీసీసీబీ చైర్మ‌న్ మామిళ్ల‌ప‌ల్లి విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి

by Ratna Kumari |

దిశ‌, పాన్ గ‌ల్ : ఆడ‌పిల్ల‌ల‌కు భ‌రోసా క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, షాదీ ముబార‌క్ అని డీసీసీబీ చైర్మ‌న్ మామిళ్ల‌ప‌ల్లి విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి, వ‌న‌ప‌ర్తి జిల్లా గ్రంథాల‌య చైర్మ‌న్ గోవ‌ర్ద‌న్ సాగ‌ర్ లు అన్నారు. బుధవారం

ఆడ‌బిడ్డ‌ల‌కు భ‌రోసా క‌ళ్యాణ‌ల‌క్ష్మీ : డీసీసీబీ చైర్మ‌న్ మామిళ్ల‌ప‌ల్లి విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి
X

దిశ‌, పాన్ గ‌ల్ : ఆడ‌పిల్ల‌ల‌కు భ‌రోసా క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, షాదీ ముబార‌క్ అని డీసీసీబీ చైర్మ‌న్ మామిళ్ల‌ప‌ల్లి విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి, వ‌న‌ప‌ర్తి జిల్లా గ్రంథాల‌య చైర్మ‌న్ గోవ‌ర్ద‌న్ సాగ‌ర్ లు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మండలానికి మంజూరైన 124 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఎక్సైజ్ అండ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను పంపిణీ చేసిన‌ట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డల పెళ్లికి తల్లిదండ్రుల భరోసాగా ఉండేందుకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహం జరిపించి ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో త‌హ‌శీల్దార్ సత్యనారాయణ రెడ్డి, డిప్యూటీ త‌హ‌శీల్దార్ అశోక్ కుమార్, మాజీ జ‌డ్పీటీసీ ర‌వికుమార్, సింగిల్ విండో మాజీ వైస్ చైర్మ‌న్ ముంత భాస్క‌ర్ యాద‌వ్, మాజీ ఎంపీటీసీ హైమావ‌తి సింగిల్ విండో డైరెక్ట‌ర్ సాయి ప్ర‌సాద్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్య‌క్షుడు మ‌ధుసూద‌న్ రెడ్డి, నాయ‌కులు పుల్లారావు బ్ర‌హ్మ‌య్య, మండ‌ల యూత్ అధ్యక్షుడు గిరిబాబు, రామ్ చంద‌ర్ గోపాల్ రావు, న‌రేంద‌ర్ గౌడ్, జూప‌ల్లి యువ‌సేన నాయ‌కులు పాల్గొన్నారు.

Next Story