నియోజకవర్గ అభివృద్ధి కి 230 కోట్లు.. 11న 3 మంత్రుల రాక

by Bhanu |

కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే నా ధ్యేయమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ్ రెడ్డి అన్నారు.

నియోజకవర్గ అభివృద్ధి కి 230 కోట్లు.. 11న 3 మంత్రుల రాక
X

దిశ, కల్వకుర్తి : కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే నా ధ్యేయమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ్ రెడ్డి అన్నారు. బుధవారం కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన వెంట పొల్యూషన్ బోర్డు మెంబెర్ బాలాజీ సింగ్, మాజీ సర్పంచ్ ఆనంద్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ నెల 11 న కల్వకుర్తి నియోజకవర్గంలో 230 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగనుందని, ఈ కార్యక్రమానికి ప్రొహిబిషన్ , ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణ రావ్, రోడ్లు, భవనాలు , సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ మల్లురవి ముఖ్య అతిధులుగా హాజరై పలు అభివృద్ధి, శంకస్థాపనలు, 220 మందికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలలో పాల్గొంటారని ఎమ్మెల్యే కసిరెడ్డి అన్నారు.


మాడ్గుల మండలంలో 30పడకల ఆసుపత్రికి శంకుస్థాపన, మాడ్గుల- కోనాపూర్ రోడ్డు వెడల్పుకు శంకుస్థాపన, వెల్దండ - శిరసన గండ్లకు డబుల్ రోడ్డు కు అక్కడి నుండి కొట్ర జంక్షన్ - తలకొండపల్లికి డబుల్ రోడ్డు, కొట్ర - కల్వకుర్తి కి నాలుగు లైన్ల రోడ్డుకు సంబంధించి టెండర్ కూడా పూర్తి అయ్యిందని దానికి కూడా శంకుస్థాపన జరుగుతుందన్నారు. అనంతరం కల్వకుర్తి లోనీ 99 సర్వే నంబర్ లో 100 పడకల ఆసుపత్రి పనులకు శంకుస్థాపన చేస్తారని, మహిళా సంఘాలకు 6 కోట్లు రుణాలు ఇచ్చే కార్యక్రమం ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాయితీ విజయకుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మిర్యాల శ్రీనివాస్ రెడ్డి, జాజుల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు,యువ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story