జూనియ‌ర్ అసిస్టెంట్ శ్రావ‌ణ్ స‌స్పెండ్

by Nallavelli.Anjaneyulu |

దిశ, జడ్చర్ల : మిడ్జిల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న శ్రావణ్ ను సస్పెండ్ చేస్తూ మంగళవారం మహబూబ్ న‌గ‌ర్

జూనియ‌ర్ అసిస్టెంట్ శ్రావ‌ణ్ స‌స్పెండ్
X

దిశ, జడ్చర్ల : మిడ్జిల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న శ్రావణ్ ను సస్పెండ్ చేస్తూ మంగళవారం మహబూబ్ న‌గ‌ర్ జడ్పీసీఈవో వెంకట్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. గత నెలలో మిడ్జిల్ మండలం వెలుగొమ్ముల గ్రామపంచాయతీ కార్యదర్శి రాజశ్రీ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ శ్రవణ్ రిమాండ్ అయ్యాడు. దీంతో రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా శ్రావణ్ ను సస్పెండ్ చేసినట్లు జడ్పిసిఈఓ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సస్పెండ్ ఉత్తర్వులను మిడ్జిల్ ఎంపీడీవో కార్యాలయానికి మెయిల్ ద్వారా పంపినట్లు ఆయన వెల్ల‌డించారు.

Next Story