పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య కేసులో జూనియర్ అసిస్టెంట్ రిమాండ్

by Nallavelli.Anjaneyulu |

దిశ, జడ్చర్ల : ఇటీవ‌లే పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే.

పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య కేసులో జూనియర్ అసిస్టెంట్ రిమాండ్
X

దిశ, జడ్చర్ల : ఇటీవ‌లే పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. జడ్చర్ల పట్టణంలో మిడ్జిల్ మండలం వెలుగొమ్ముల కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్న రాజా శ్రీ ఆత్మహత్య కేసులో ఆమె సహ ఉద్యోగి మిడ్జిల్ ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ శ్రావణ్ ను రిమాండ్ చేసినట్టు పట్టణ సీఐ కమలాకర్ తెలిపారు. తమ కూతురును సహ ఉద్యోగి శ్రావణ్ లైంగిక వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారించి రిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తమ కూతురి ఆత్మహత్య కేసు కాంప్రమైజ్ అయినట్లు పుకార్లు వెళ్లుతాయని.. తాము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదని ఇకముందు కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రస‌క్తే లేద‌న్నారు మృతురాలి తండ్రి కృష్ణయ్య. తమ కూతురికి జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకూడదు అంటే తమ కూతురిని వేధించి ఆత్మహత్య చేసుకునే విధంగా చేసిన నిందితుడు శ్రావణ్ ను కఠినంగా శిక్షించాలని మృతురాలి తండ్రి కృష్ణయ్య పోలీసులను వేడుకున్నారు.

Next Story