ఉద్యోగాల కల్పనకు నిలయం జేపీఎన్సీఈ కళాశాల

by Nallavelli.Anjaneyulu |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఉద్యోగాల కల్పనకు జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల (జేపీఎన్సీఈ) నిలయంగా మారిందని బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ సాగర్ అన్నారు.

ఉద్యోగాల కల్పనకు నిలయం జేపీఎన్సీఈ కళాశాల
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఉద్యోగాల కల్పనకు జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల (జేపీఎన్సీఈ) నిలయంగా మారిందని బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ సాగర్ అన్నారు. యూజీసీ అటానమస్ సంస్థ జేపీఎన్సీఈ కళాశాల తో ప్రతిష్టాత్మకమైన 'టిసీఎస్, ఐయాన్' కంపెనీలతో చదువు పూర్తి అయిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థుల ఉద్యోగాల కల్పన కోసం, కళాశాల చైర్మెన్ కెఎస్ రవికుమార్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం రాష్ట్రంలోనే మొదటిసారి అని, ఇది జిల్లాకే గర్వకారణం అని, అందుకు అభినందనీయం అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మెన్ కెఎస్ రవికుమార్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దుర్గేష్, వెంకటేష్ గౌడ్, శేఖర్, ఆంజనేయులు, సాగర్, సుకుమార్ పాల్గొన్నారు.

Next Story