- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక
దిశ, పాన్ గల్ : మండల పరిధిలోని చిక్కెపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ముంత పార్వతీ సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో

దిశ, పాన్ గల్ : మండల పరిధిలోని చిక్కెపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ముంత పార్వతీ సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆయన కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. గ్రామానికి చెందిన శ్రీను, నరసింహ, కురుమయ్య, మేకల రాములు, రాఘవేందర్ తో పాటు 60 మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అందరూ కలిసి కట్టుగా పని చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెబ్బేటి వీరసాగర్, మాజీ ఎంపీపీ మామిళ్లపల్లి శ్రీధర్ రెడ్డి, నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షుడు వెంకట రాములు యాదవ్, మాజీ సర్పంచ్ బాలస్వామి, నాయకులు సుధాకర్ యాదవ్, ధనుంజయ్ రెడ్డి, ధర్మా రెడ్డి, బీరంప్రతాప్ రెడ్డి, రాజా రెడ్డి,ఖాదర్, భాస్కరాచారి, ముంత రాము యాదవ్, బాల చంద్రుడు, జంపయ్య యాదవ్, స్వామి, అర్జున్ పాల్గొన్నారు.






