- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జయప్రకాష్ నారాయణ్ గొప్ప సిద్ధాంతకర్త : ఉన్నత విద్యా మండలి చైర్మెన్ బాలకిష్టారెడ్డి
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : స్వాతంత్య్ర సమరయోధుడు, సోషలిస్టు, సిద్ధాంతకర్త లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ అని, ఆయన నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : స్వాతంత్య్ర సమరయోధుడు, సోషలిస్టు, సిద్ధాంతకర్త లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ అని, ఆయన నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే గొప్ప నాయకుడని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మెన్ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. శనివారం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ 123 వ జయంతి సందర్భంగా స్థానిక జెపిఎన్సీఈ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కళాశాల చైర్మెన్ కెఎస్ రవికుమార్ తో కలిసి జయప్రకాష్ నారాయణ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. నేటి ప్రపంచంలో పోటీతత్వం పెరిగిందని,అవకాశాలను అందిపుచ్చుకోవాలని, 21 వ శతాబ్దంలో భారతదేశం సాంకేతిక పరిజ్ఞానంలో ఎంతో అభివృద్ధి చెంది ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఎంతో కృషి చేస్తున్నారని, స్కిల్ యూనివర్సిటీ స్థాపించి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. కళాశాల చైర్మెన్ కెఎస్ రవికుమార్ మాట్లాడుతూ, జయప్రకాష్ నారాయణ ఒక గొప్ప రాజకీయవేత్త అని, అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసుకొని, భారతదేశంలో సర్వోదయ ఉద్యమం, భూదాన్ ఉద్యమం లో పాల్గొన్నారని, జీవితంలో ఎలాంటి పదవులు ఆశించకుండా లోక్ సేవక్ గా ఉండి లోక్ నాయక్ గా గుర్తింపు పొందాడని ఆయన కొనియాడారు. అంతకుముందు ఆన్ లైన్ అసైన్మెంట్ కొరకు కంప్యూటర్ ల్యాబ్ ను బాలకిష్టారెడ్డి ప్రారంభించారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి వెంకటరామారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమూర్తి, పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, పరీక్షల నిర్వాహణ అధికారి కోటల సందీప్ కుమార్, బాలయ్య, అజయ్ కుమార్ పాల్గొన్నారు.






