ధ‌ర్మాపూర్ వైన్ షాపు ఎవ‌రికీ ద‌క్కిందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!

by Ratna Kumari |

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన మహబూబ్ నగర్ జిల్లా ధర్మాపూర్ వైన్ షాప్ న‌కు జరిగిన లక్కీ డిప్ లో భూత్పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన జట్రం

ధ‌ర్మాపూర్ వైన్ షాపు ఎవ‌రికీ ద‌క్కిందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన మహబూబ్ నగర్ జిల్లా ధర్మాపూర్ వైన్ షాప్ న‌కు జరిగిన లక్కీ డిప్ లో భూత్పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన జట్రం శ్రీనుకు దక్కింది. వైన్ షాప్ నిర్వహణ కోసం ఎక్సైజ్ అధికారులు మిగతా వైన్ షాపులతో పాటు మహబూబ్ నగర్ మండల పరిధిలోని ధర్మపురి వైన్ షాప్ కు కూడా ఆహ్వానించారు. మహబూబ్ నగర్ పట్టణంలో పీఈటీగా పని చేస్తున్న పుష్ప అనే ఉపాధ్యాయురాలు దరఖాస్తు చేసుకోవడంతో ఆమెకు ఆ వైన్స్ షాపు ద‌క్కింది. ఒక ఉపాధ్యాయురాలు బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి వైన్ షాప్ ను దక్కించుకోవడం ఎక్సైజ్ శాఖ నిబంధనలు తప్పు పట్టకపోయినప్పటికి.. విద్యాశాఖ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. అయినప్పటికీ ఆమె వైన్ షాపు నిర్వహణ కోసం రెంటల్ చెల్లించింది. ఈ నేపథ్యంలో పలు విమర్శలు తలెత్తడంతో విద్యాశాఖ అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. వైన్ షాపు నిర్వహణ బాధ్యతలను వదులుకోకపోతే ఉద్యోగం నుండి పూర్తిగా తొలగించే ప్రమాదం ఉండడంతో ఆమె ఎట్టకేలకు వైన్ షాపును వదులుకొని పీఈటిగా కొనసాగడానికి నిర్ణయించుకుంది. ఈ అంశాలన్నీ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలకు తెర లేపాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు రిటైడర్లు ఆహ్వానించడంతో 28 మంది దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన లక్కీ డిప్ లో చక్రం శీను కు అదృష్టం వ‌రించింది. ఈ మేరకు జిల్లా ఎక్సైజ్ అధికారి సుధాకర్, అసిస్టెంట్ ఎక్సైజ్ అధికారి నరసింహారెడ్డి శ్రీను కు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

Next Story