- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మండేఎండలో ఉడుకుతూ డ్యూటీ చేసేది ట్రాఫిక్ సిబ్బంద్దే : ఎస్పీ జానకి
భగభగమండే ఎండల్లో ఉడుకుతూ డ్యూటీలు చేసేది ఒక్క ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది మాత్రమే నని జిల్లా ఎస్పీ జానకి అన్నారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: భగభగమండే ఎండల్లో ఉడుకుతూ డ్యూటీలు చేసేది ఒక్క ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది మాత్రమే నని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని ఆమె తన ఛాంబర్లో ట్రాఫిక్ సిబ్బందికి చలువ కళ్ళద్దాలను పంపిణీ చేసి మాట్లాడారు. రోజురోజుకూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ట్రాఫిక్ సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విధులు నిర్వహించాలని, ముఖ్యంగా డిహైడ్రేషన్ సమస్యలు రాకుండా తరచూ మంచినీరు, ఓఆర్ఎస్ ద్రావణాలు, లెమన్ వాటర్, బట్టర్ మిల్క్ వంటి ద్రవాలను తీసుకోవాలని అన్నారు. విధుల్లో ఉన్నపుడు తలకు టోపీ, సన్ గ్లాసెస్ ధరించాలని, వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప వైద్య సేవలకు సంప్రదించాలని సూచించారు. డ్యూటీలో తల తిరగడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే అధికారులకు తెలపాలని, రోజూవారీ విధుల్లో మధ్య మధ్య చిన్న విరామాలు తీసుకుంటూ శరీరాన్ని చల్లగా ఉండేలా చూసుకోవాలి ఎస్పీ జానకి పలు సూచనలు చేశారు.
పదోన్నతి చిహ్నాలు బహుకరించిన ఎస్పీ జానకి..
జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కరుణాకర్ చారీ(1028), శ్రీనివాస్ (1999), డిస్ట్రిక్ట్ క్రైం రికార్డ్స్ బ్యూరో లో విధులు నిర్వహిస్తున్న జనార్ధన్ (492) కానిస్టేబుళ్లలకు హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి లభించిన సందర్భంగా వారికి 'పదోన్నతి చిహ్నాలు' బహుకరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పదోన్నతి ద్వారా పొందిన అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పోలీస్ శాఖ కు మంచిపేరు తీసుకురావాలని ఎస్పీ జానకి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బీ డిఎస్పీ లు రమణారెడ్డి, బాలాజీ, సీఐలు నర్సింహులు,అప్పయ్య పాల్గొన్నారు.






