- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యా సంస్థలను నిర్వీర్యం చేయడమే ప్రభుత్వ లక్ష్యమా..? : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
విద్యా సంస్థలను నిర్వీర్యం చేయడమే ప్రభుత్వ లక్ష్యమా అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, వనపర్తి టౌన్ : వనపర్తి పట్టణంలోని మెడికల్ కళాశాలను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విద్యార్థులను కలసి కళాశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెడికల్ కళాశాల ఆవరణలో యంగ్ ఇండియా స్కూల్ కోసం 8ఎకరాల స్థలం కేటాయించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో అత్యంత ఉన్నత ప్రమాణాలతో మెడికల్ కళాశాల ఉండాలని భావి తరాల విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండాలని మెడికల్, ప్యారా మెడికల్, హాస్టల్, రీసెర్చ్ సెంటర్, వసతిని దృష్టిలో ఉంచుకొని 50ఎకరాలతో సువిశాలమైన మెడికల్ కళాశాల ఆవరణ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ప్రభుత్వం అనాలోచిత చర్యలతో మెడికల్ కళాశాల ఆవరణలో యంగ్ ఇండియా స్కూల్ కోసం 8ఎకరాలు కేటాయించడం అనైతిక చర్య అని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో మెడికల్ కళాశాలకు అనేక మౌలిక వసతుల కోసం స్థలం అవసరమని ప్రభుత్వం పునఃపరిశీలించి యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలమును ఉపసంహరించుకోవాలని అన్నారు. ప్రభుత్వ స్థలాలు అనేకం ఉన్నాయని వాటిలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మించాలని, మాకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. సంప్రదింపులు, చర్చలు లేకుండా ఏకపక్షంగా కేటాయించడం పద్ధతి కాదన్నారు. మెడికల్ కాలేజీలు వెలువడే వ్యర్థాలు డిస్పోజల్ మేనేజ్మెంట్ ద్వారా దూరం చేయడం జరుగుతుందని అటువంటి ఆవరణలో స్కూల్ ఏర్పాటు చేయడం విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటం అడటమేననని పేర్కొన్నారు.
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మెడికల్ కళాశాల ఆవరణలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ పరిస్థితులను వివరిస్తూ లేఖ రాసి స్వయంగా ఫోన్ చేసి పునః పరిశీలన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, గంధం బాలపీర్, పరంజ్యోతి, ధర్మానాయక్, కౌన్సిలర్లు మురళీ సాగర్, శ్రీకర్ గౌడ్, ప్రేమ్ నాథ్ రెడ్డి, హరి బాబు, బండారు కృష్ణ, దేవర్ల నరసింహ, రవి ప్రకాశ్ రెడ్డి, బాబు నాయక్, హేమంత్ ముదిరాజ్, వెంకట్ సాగర్, రాము, ప్రేమ్ కుమార్, రవి, తేజారెడ్డి శ్రీను, కురుమూర్తి పాల్గొన్నారు.






