మూడు వందల కోట్ల‌తో ల‌క్ష ఎక‌రాల‌కు సాగునీరు

by Nallavelli.Anjaneyulu |

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాన‌స పుత్రిక అయిన మ‌క్త‌ల్ - నారాయ‌ణ‌పేట కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి మొద‌టి స్టేజీ మ‌క్త‌ల్ మండ‌లంలోని కాట్ర‌ప‌ల్లి గ్రామం వ‌ద్ద ఆదివారం సంబంధిత ఇరిగేష‌న్ ఇంజ‌నీర్ అధికారి భూమి పూజ చేసారు.

మూడు వందల కోట్ల‌తో ల‌క్ష ఎక‌రాల‌కు సాగునీరు
X

దిశ‌, మ‌క్త‌ల్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాన‌స పుత్రిక అయిన మ‌క్త‌ల్ - నారాయ‌ణ‌పేట కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి మొద‌టి స్టేజీ మ‌క్త‌ల్ మండ‌లంలోని కాట్ర‌ప‌ల్లి గ్రామం వ‌ద్ద ఆదివారం సంబంధిత ఇరిగేష‌న్ ఇంజ‌నీర్ అధికారి భూమి పూజ చేసారు. మ‌క్త‌ల్- నారాయ‌ణ‌పేట‌-కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల ప‌థ‌కం వ‌ల్ల దాదాపు ల‌క్ష ఎక‌రాల‌కు సాగునీరు, తాగునీరు అందించే ఉద్దేవంతో ఈ ప‌థ‌కాన్ని రేవంత్ రెడ్డి ప‌థ‌కం చేప‌ట్టింది. అయితే ప్ర‌స్తుతం మున్సిప‌ల్ ఎన్నిక‌ల కోడ్ ఉండ‌టంతో ముగిసేవ‌ర‌కు ప‌నుల‌కు ఆల‌స్యం అవుతుందనే ఉద్దేశంతో ఇవాళ భూమి పూజ నిర్వ‌హించారు. కృష్ణా నదిపై ఉన్న జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ను పంచేదేవ్ పహాడ్ దగ్గర లిఫ్ట్ చేసి సంగం బండకు బూత్పూర్ రిజర్వాయర్కు పంపి చేయడం జరుగుతుంది. కాట్రపల్లి గ్రామం సంపౌజు నుండి నీటిని 30 మెగావాట్స్ కెపాసిటీ గల రెండు పంపుల ద్వారా ఉట్కూర్ చెరువుకు పంపు చేయడం జరుగుతుందని సంబంధిత ఇంజనీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ శ్రీధర్, ఈఈ గోపాల చారి, ఎఈఈ నాగ శివ, రాఘవ క‌న్ స్ట్ర‌క్ష‌న్ ఎండీ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story