మంత్రి వాకిటి శ్రీహ‌రికి భద్రాచ‌లం నుంచి ఆహ్వానం

by Ratna Kumari |

మార్చి 27న శ్రీరామ న‌వ‌మి సంద‌ర్భంగా భ‌ద్రాచాలంలో నిర్వ‌హించనున్న సీతారామ చంద్ర‌స్వామి బ‌హ్మ్రోత్స‌వాల‌కు హాజ‌రుకావాల‌ని శ‌నివారం మంత్రి క్వార్ట‌ర్స్ లో ర‌ష్ట్ర ప‌శు సంవ‌ర్ద‌క, పాడి పారిశ్రామికాభివృద్ధి, మ‌త్స్య‌, యువ‌జ‌న స‌ర్వీసులు, క్రీడ‌ల శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో,ఆలయ అర్చకుల బృందం ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆ

మంత్రి వాకిటి శ్రీహ‌రికి భద్రాచ‌లం నుంచి ఆహ్వానం
X

దిశ‌, మ‌క్త‌ల్ : మార్చి 27న శ్రీరామ న‌వ‌మి సంద‌ర్భంగా భ‌ద్రాచాలంలో నిర్వ‌హించనున్న సీతారామ చంద్ర‌స్వామి బ‌హ్మ్రోత్స‌వాల‌కు హాజ‌రుకావాల‌ని శ‌నివారం మంత్రి క్వార్ట‌ర్స్ లో ర‌ష్ట్ర ప‌శు సంవ‌ర్ద‌క, పాడి పారిశ్రామికాభివృద్ధి, మ‌త్స్య‌, యువ‌జ‌న స‌ర్వీసులు, క్రీడ‌ల శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో,ఆలయ అర్చకుల బృందం ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆహ్వానాన్ని స్వీకరించిన మంత్రి వాకిటి శ్రీహరి లలిత దంపతులను మంత్రో చ్ఛారణలతో ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. భద్రాచలం శ్రీరాముని ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు. మంత్రిని ఆహ్వానించిన వారిలో భద్రాచలం ఆలయం ఈవో దామోదర్‌, ఆలయ ఉప ప్రధానార్చకులు శ్రీనివాస రామానుజం, రామాయణంపారాయణుడు అంతర్వేది కృష్ణమాచార్య, ఎఈఓభవానీ రామకృష్ణలు ఉన్నారు.

Next Story