- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భయభ్రాంతులకు గురి చేసి గెలిచారు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను, బీఆర్ఎస్ అభ్యర్థులను భయబ్రాంతులకు గురి చేసి గెలిచారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : ఓటర్లను.. బీఆర్ఎస్ అభ్యర్థులను అధికార పార్టీ నాయకులు , పోలీసులు భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికలలో గెలిచారు అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో నూతనంగా గెలుపొందిన 16 మంది కార్పొరేటర్ లను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ను ఓడించడానికి అన్ని పార్టీలు ఏకం అయ్యాయని తెలిపారు. కొంతమంది పోలీసు అధికారులను ఉపయోగించుకొని భయభ్రాంతులకు గురిచేసి మెజారిటీ స్థానాలు గెలిచారు తప్ప.. ప్రజాభిమానంతో ఎంత మాత్రం కాదు అని మాజీ మంత్రి అన్నారు. ఎన్నికలలో గెలిచేందుకు అధికార పార్టీ అభ్యర్థులు చేస్తున్న అరాచకాలు, మోసాలపై ఎన్నికల సంఘానికి, పోలీసులకు ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఐదు శాతం సీట్లు కూడా లేవు.. మాకు ఇప్పుడు 30% కు పైగా సీట్లు దక్కాయి అని చెప్పారు. మరికొన్ని సీట్లను అతి తక్కువ ఓట్ల మెజారిటీతో కోల్పోయాము అన్నారు. అన్ని అవాంతరాలను అధిగమించి మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో 16 స్థానాలను గెలుచుకున్నామని చెప్పారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో మా ప్రభుత్వ హయాంలో చేపట్టిన అనేక అభివృద్ధి పనులను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది అన్నారు.. వాటి పరిష్కారం కోసం మా కార్పొరేటర్లు కలిసికట్టుగా కృషి చేస్తారని వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ల వ్యవహారం తేలిన తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఈ ప్రభుత్వం వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, నూతనంగా ఎంపికైన కార్పొరేటర్ లు పాల్గొన్నారు.






