బ్యాంకు చెక్కులను తస్కరించే అంతరాష్ట్ర దొంగ అరెస్ట్

by Kodari Anjali |

వృద్ధులను మోసం చేసి చెక్కులను తస్కరించే అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేసినట్లు మహబూబ్‌నగర్ టూ టౌన్ సీఐ ఇజాజోద్దీన్ తెలిపారు.

బ్యాంకు చెక్కులను తస్కరించే అంతరాష్ట్ర దొంగ అరెస్ట్
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బ్యాంకులకు చెక్కు బుక్‌తో నగదు 'డ్రా' చేసుకోవడానికి వచ్చే వృద్ధులను మోసం చేసి చెక్కులను తస్కరించే అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేసినట్లు మహబూబ్‌నగర్ టూ టౌన్ సీఐ ఇజాజోద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో నిందితుడుని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు తెలిపారు. నిందితుడు ఏపి రాష్ట్రం కర్నూలు జిల్లాకు చెందిన డి.సిద్దేష్ అలియాస్ దండన్నగారి సిద్దేష్(34) తండ్రి లేట్ చంద్రారెడ్డి, ఈనెల 1 న స్థానిక న్యూ టవున్ ఎస్బీఐలో ఎండి అసదుల్లా అనే వృద్ధుడి చెక్ బుక్ నుండి ఆ వృద్ధుడు సంతకం చేసిన ఒక చెక్‌ను అతనికి తెలియకుండా దొంగిలించాడని, దొంగిలించిన చెక్కును అనంతపూర్ జిల్లా రాంనగర్ లోని ఎస్బీఐ శాఖ వద్ద డబ్బులు జమ చేయడానికి వచ్చిన ఒక వ్యక్తి ని సంప్రదించి, తనకు అర్జంటుగా నగదు అవసరం ఉందని నమ్మబలికి, ఆ వ్యక్తికి ఆ చెక్కును ఇచ్చి 90 వేలు తీసుకున్నాడని సీఐ వివరించారు. అంతేకాక గత ఏడాది ఫిబ్రవరి లో క్లాక్ టవర్ ఎస్బీఐ శాఖలో ఇదే తరహా ఒక వృద్ధుడి చెక్కు ను దొంగిలించి 50 వేలు డ్రా చేశాడని, ఈ నిందితుడిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీస్ స్టేషన్ లలో మొత్తం 16 కేసులు నమోదైనట్లు విచారణ లో తేలిందని ఆయన తెలిపారు. కేసును సమర్థవంతంగా ఛేదించిన టూ టౌన్ సీఐ ఇజాజోద్దీన్, ఎస్ఐ విజయ్ భాస్కర్, హెడ్ కానిస్టేబుల్ శేఖర్, కానిస్టేబుళ్లు శ్రీను, అశోక్ లను జిల్లా ఎస్పీ జానకి అభినందించారు.

Next Story