- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన అంతర్జాతీయ క్రీడాకారుడు మృత్యంజయ సుంకర్
అంతర్జాతీయ క్రీడాకారుడు మృత్యుంజయ సుంకర్ రాష్ట్ర పశుసంవర్థక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని బుధవారం హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాద పూర్వకంగా కలిశారు.

దిశ, మక్తల్ : అంతర్జాతీయ క్రీడాకారుడు మృత్యుంజయ సుంకర్ రాష్ట్ర పశుసంవర్థక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని బుధవారం హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవలే అబుదాబిలో జరిగిన ఓపెన్ వరల్డ్ మాస్టర్స్ గేమ్స్-2026లో కాంపిటేటివ్ క్రికెట్స్ విభాగంలో అంతర్జాతీయ వేదిక పై సాధించిన విజయాన్ని వివరించి.. సిల్వర్ మెడల్ ను మంత్రి చూపించారు. అలాగే ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన లెవల్ -2 కోచింగ్ పరీక్షకు ఎంపికైన విషయాన్ని క్రీడల శాఖ మంత్రి శ్రీహరిని వివరించారు. రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి తీసుకువచ్చిన మృత్యుంజయ సుంకర్ ని అభినందిస్తూ రాష్ట్రంలోని యువ క్రీడాకారులు విజయాలు సాధించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభను వెలికి తీసి.. అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు.






