- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gadwala Congress : గద్వాల కాంగ్రెస్ లో అంతర్గత పోరు
నేడు జరిగిన గద్వాల(Gadwala)లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నాయకుల అంతర్గత పోరు బయట పడింది.

దిశ, వెబ్ డెస్క్ : నేడు జరిగిన గద్వాల(Gadwala)లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నాయకుల అంతర్గత పోరు బయట పడింది. ఈ సమావేశంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(AICC) కార్యదర్శులు విశ్వనాథ్, సంపత్ హాజరు కాగా.. గద్వాల కాంగ్రెస్ ఇన్‌చార్జ్ సరితా తిరుపతయ్య(Saritha Tirupathaiah) కీలక వ్యాఖ్యలు చేశారు. సరితా తిరుపతయ్య మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇంతటి కష్టాలు ఎదుర్కోలేదని, ప్రస్తుతం తన అనుచరులపై అకారణంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. కాగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గత ఎన్నికల్లో గులాబీ పార్టీ తరపున గెలిచి, కాంగ్రెస్ లోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishna Mohan Reddy)పై కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సరిత వర్గీయులు దీనిని జీర్ణించుకోలేక పోయారు.
ఇరువర్గాల మధ్య అనేకసార్లు ప్రోటోకాల్ రచ్చ జరిగింది. ఈ క్రమంలోనే సరితా తిరుపతయ్య పార్టీ విస్తృత సమావేశంలో కృష్ణమోహన్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. కాగా ఏఐసీసీ నాయకులు సరితకు నచ్చజెప్పి సమావేశం కొనసాగించారు. అనంతరం జోగులాంబ గద్వాల జిల్లాలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, ప్రజల్లోకి కాంగ్రెస్ సంక్షేమ కార్యక్రమాలను తీసుకెళ్లే వ్యూహాలపై చర్చ జరిగింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.






